Begin typing your search above and press return to search.
మందకృష్ణ తర్వాతి టార్గెట్ ఆయనేనా?
By: Tupaki Desk | 12 May 2016 5:11 AM GMTఎస్సీ వర్గీకరణ మీద ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తన పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు. మొన్నటికి మొన్న కాకినాడలో ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ నిర్వహించిన ప్రత్యేక హోదాపై ధర్నా కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ మీద ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు చేసిన హడావుడి తెలిసిందే. జగన్ ప్రసంగానికి అడ్డు తగులుతూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయటం.. ఎస్సీ వర్గీకరణ మీద ఆయన స్పందించాలంటూ డిమాండ్ చేయటం తెలిసిందే. ఏపీ విపక్ష నేతను తాము వదిలిపెట్టేది లేదన్నట్లుగా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు వ్యవహరిస్తుంటే.. వారి నాయకుడు మందకృష్ణ తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీద విమర్శలు ఎక్కు పెట్టారు.
ఎస్సీ వర్గీకరణ మీద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కపట నాటకం ఆడుతున్నట్లుగా ఆయన మండిపడుతున్నారు. వర్గీకరణ మీద ప్రధాని మోడీని కలిసిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కపట నాటకంలో భాగంగా మందకృష్ణ ఆరోపిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ మీద తెలంగాణ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉండి ఉంటే.. అఖిలపక్షంతో ప్రధానిని కలిసేవారంటూ వ్యాఖ్యానించారు.
వర్గీకరణతోనే సామాజిక న్యాయం జరుగుతుందని వాదిస్తున్న మందకృష్ణ వైఖరి చూస్తుంటే.. రానున్న రోజుల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సైతం నిరసన సెగ తగలటం ఖాయంగా కనిపిస్తోందని చెప్పాలి. జగన్.. కేసీఆర్ ల మీద వరుసగా ఫైర్ అవుతున్న మందకృష్ణ తర్వాతి లక్ష్యం చంద్రబాబేనని చెబుతున్నారు.