Begin typing your search above and press return to search.
బాబుకు.. వర్గీకరణ ఇంకెంత షాకిస్తుందో?
By: Tupaki Desk | 14 Feb 2016 10:35 AM GMTఒకటి తర్వాత ఒకటిగా సమస్యలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నెత్తి మీద వచ్చి పడుతున్నాయి. బలమైన విపక్షం లేదన్న సంబరంలో ఉన్న ఏపీ అధికారపక్షాన్ని.. కులాల రిజర్వేషన్ల మధ్య రగిలిన చిచ్చు కొత్త సమస్యల్ని తెచ్చిపెడుతోంది. వారం.. పదిరోజుల పాటు ఏపీ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేసిన బీసీల్లోకి కాపుల రిజర్వేషన్ల అంశం.. ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. ఆ సంతోషం రెండు రోజులు కూడా లేకుండానే.. కాపుల్ని బీసీల్లోకి చేరిస్తే.. తమ సంగతేమిటంటూ బీసీనేతలు గళం విప్పటమే కాదు.. నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు మందకృష్ణ మాదిగ. ఎన్నికల సందర్భంలో మాదిగలను ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తానని చెప్పటం తెలిసిందే. ఇప్పటివరకూ బాబు సర్కారు మీద విమర్శలు మాత్రమే సంధించిన మందకృష్ణ తాజాగా ఎస్సీ వర్గీకరణ విషయంలో ఏపీముఖ్యమంత్రికి అల్టిమేటం జారీ చేశారు.
ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు అనుకూలమా? కాదా? అన్న విషయాన్ని 48 గంటల్లో ప్రకటన చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ ఆయన కానీ స్పందించకుంటే.. అన్ని పార్టీల్లోని మాదిగలతో కలిసి కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఒకటి తర్వాత ఒకటిగా వచ్చి పడుతున్న కులాల ఇష్యూ బాబుకు ఊపిరి ఆడకుండా చేస్తుందనే చెప్పాలి.