Begin typing your search above and press return to search.
బీజేపీలోకి మంద కృష్ణ !?
By: Tupaki Desk | 27 July 2015 3:04 PM GMTమందకృష్ణ మాదిగ. అణగారిన దళిత జాతిని తనదైన శైలిలో తెరమీదకు తెచ్చిన ఉద్యమకారుడు. ఎస్సీ వర్గీకరణ అంశంతో పోరాటం చేసి దాన్ని సాధించుకొని దళిత ఉపకులాల జీవితాల్లో వెలుగులు పూయించారు. అనంతరం ఆత్మగౌరవ వేదిక కోసం మహజన సోషలిస్టు పార్టీ పేరుతో సొంత పార్టీని ఏర్పాటు చేశాడు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆ పార్టీ గుర్తు ద్వారా ఆయనతో పాటు పలువురు పోటీ చేశారు. రెండు చోట్ల పోటీ చేసినప్పటికీ మందకృష్ణ ఓడిపోయారు.
కొద్దికాలంగా తనదైన శైలిలో పోరాటాలు చేస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లో బలమైన పాలకులు ఉండటం వల్ల పెద్దగా గుర్తింపు దక్కడం లేదు. ఈ నేపథ్యంలో మందకృష్ణ కొత్త నిర్ణయం ఏమైనా తీసుకున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం దీనికి బలం చేకూరుస్తుంది.
మందకృష్ణ సికింద్రాబాద్‌లోని అడ్డగుట్ట కార్యాలయంలో తన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటుచేస్తుంటారు. అయితే తాజాగా మంగళవారం బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు మందకృష్ణ. ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. మందకృష్ణ కాషాయ కండువా కప్పుకొంటారా అనే చర్చ సాగుతోంది. పార్టీలో చేరి వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిగా దిగుతారు అని పలు వర్గాలు జోస్యం చెప్తున్నారు.
వరంగల్ ఎంపీ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పై గెలవాలంటే ప్రస్తుతం ఉన్న పార్టీ నేతల చరిష్మా సరిపోదని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. అందుకే మాస్ ఫాలోయింగ్ ఉన్న మందకృష్ణను పార్టీలోకి చేర్చి ఎన్నికల్లో ముద్ర చాటుకోవడమే కాకుండా...కేసీఆర్‌కు దీటైన ప్రత్యర్థిని అందించినట్లవుతుందని కమళదళాలు అంచనా వేస్తున్నాయి.