Begin typing your search above and press return to search.
మండలి బుద్దప్రసాద్ పై కాంగ్రెస్ కన్ను
By: Tupaki Desk | 19 Dec 2016 6:07 AM GMTఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ టీడీపీలో ఇమడలేకపోతున్నారట. మంత్రి పదవి ఆశించిన కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన ఆయన తొలి నుంచి కొంత అసంతృప్తిగానే ఉన్నారు.. అయితే... ఇటీవల కాలంలో అది మరింత తీవ్రమవుతోందని కృష్ణా జిల్లా టీడీపీ నేతలు అంటున్నారు. ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికి చేరే ఆలోచనలోనూ ఉన్నట్లు చెబుతున్నారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కనుక మళ్లీ కాంగ్రెస్ లోకి చేరితే మండలి కూడా కాంగ్రెస్ వెళ్లే అవకాశాలున్నాయని అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీలో పుట్టి, కాంగ్రెస్ లోనే పెరిగి - వివిధ హోదాల్లో పదవులు నిర్వహించిన మండలి బుద్దప్రసాద్ అనుకోని రీతిలో తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్నారు. చాలామంది కంటే బెటర్ గా ఆయనకు డిప్యూటీ స్పీకర్ హోదా దక్కింది. కానీ... ఆయన మంత్రి పదవిని కోరుకుంటున్నారు. మంత్రి పదవిని ఆశించిన మండలికి డిప్యూటీ స్పీకర్ తో సరిపెట్టడంతో ఆయన ఆరంభం నుంచీ తీవ్ర అసంతృప్తిగానే ఉన్నారు. అయితే ఇవేమీ బయటకు కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. కాంగ్రెస్ లో ఉన్నంత స్వేచ్ఛ - స్వాతంత్ర్యాలు తెలుగుదేశం పార్టీలో ఉండవని ఆయనకు స్వల్పకాలంలోనే తెలిసి వచ్చింది. కానీ ప్రత్యామ్నాయం లేదు. పార్టీని వీడే ముందే అన్నీ ఆలోచించారు. కాంగ్రెస్ కు ఇప్పట్లో పుట్టగతులు ఉండవు. వైసిపిలో చేరే పరిస్థితి లేదు, ఇక మిగిలింది తెలుగుదేశం మాత్రమే. ఆపార్టీ పిలిచి టిక్కెట్ ఇస్తానంటుంది. అందుకే వెళ్లాల్సి వచ్చింది. అని మండలి సన్నిహితుల దగ్గర ఎన్నోసార్లు పేర్కొన్నారు.
కానీ... కాంగ్రెస్ లోకి మళ్లీ వెళ్లడానికి ఉన్న దారులను ఆయన ఏమాత్రం క్లోజ్ చేసుకునే ఆలోచనతో లేరు. ప్రతిపక్షాన్ని గానీ, మాతృసంస్థ అయిన కాంగ్రెస్ ను కానీ పన్నెత్తు మాట అనడం లేదు. అసలు రాజకీయ వాసనే లేకుండా ఆయన వ్యవహరిస్తున్నారు. భాషా - సాంస్కృతికాంశాలు - సన్మాన - సత్కార సభలకు వెళుతూ కాలక్షేపం చేస్తున్నారు. టీడీపీలో ఆయన అన్యమనస్కంగా ఉండడంతో కాంగ్రెస్ వైపు నుంచి సంప్రదింపులు కూడా మొదలైనట్లు తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/