Begin typing your search above and press return to search.
1991 సీన్ చెప్పి హెచ్చరిస్తున్నారు!!
By: Tupaki Desk | 21 Sep 2016 11:52 AM GMTతమిళనాడు - కర్ణాటకల మధ్య కావేరీ జల వివాదం సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. కొన్ని రోజుల క్రితం సుప్రీం ఇచ్చిన ఉత్తర్వులతో కర్ణాటక - తమిళనాడులు భగ్గుమన్నాయి. ఈ క్రమంలో తాజాగా మరోసారి స్పందించిన సుప్రీం.. రోజుకు ఆరువేల క్యూసెక్కుల చొప్పున ఈ నెల 27వరకు ప్రతి రోజు తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయాలని ఆదేశించింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన ఇబ్బందిని చెప్పగా.. మాండ్యా ప్రాంత రైతులు మరోసారి ఆందోళనకు దిగారు. రోడ్లపైకి వచ్చి ర్యాలీలు తీస్తూ.. కావేరీ జలాలు తమిళనాడుకు వదులుతూ తమకు ఉరి శిక్ష వేస్తున్నారని రోడ్డుపై ప్రదర్శనలు ఇస్తున్నారు.
ఈ సందర్భంగా మాండ్యా ప్రాంత రైతులు చేస్తున్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. కావేరీ జలాల పంపిణి విషయంలో తమిళనాడు ప్రభుత్వం ఇలానే వ్యవహరిస్తే 1991లో జరిగిన పరిణామాలు మళ్లీ రిపీట్ అవుతాయని.. బెంగళూరు నగరంలో లక్షలాది మంది తమిళులు ఉన్నారన్న విషయం తమిళనాడు ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలని మాండ్యాప్రాంత రైతులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు బెంగళూరులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున ఎక్కడికక్కడా బలగాలను మోహరించడంతో ప్రస్తుతానికి శాంతియుత పరిస్థితులతోనే కనిపిస్తోంది. మరోపక్క, ప్రతి ఒక్కరు సంయమనం పాటించాలని కర్ణాటక హోంమంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కావేరి జలాలు పారే కర్ణాటకలోని అన్ని ప్రాంతాల్లో బలగాలను మోహరించారు. ఇదే సందర్భంలో... ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఉండమని పోలీసు అధికారులు ఇప్పటికే హెచ్చరించారు.
కాగా... 1991లో ఇదే విధంగా కర్ణాటక - తమిళనాడుల మద్య కావేరీ జలాల పంపీణి విషయంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఆ సమయంలో బెంగళూరు నగరంలో నివాసం ఉంటున్న దాదాపు రెండు లక్షల మంది తమిళులు కర్ణాటకను వదిలి తమిళనాడుకు వెళ్లిపోయారు. అనంతరం అల్లర్లు సర్దుమనిగిన తర్వాత లక్షమంది తమిళులు తిరిగి బెంగళూరు చేరుకోగా, లక్ష మంది తమిళులు తమిళనాడులోనే ఉండిపోయారు. అయితే.. ఇదే విషయాన్ని చూపించి మరలా కన్నడీగులు తమిళనాడుని హెచ్చరిస్తున్నారు!!