Begin typing your search above and press return to search.
సోనియా - మేనక.. పలకరించుకున్నారు..కలుస్తారా?
By: Tupaki Desk | 19 Jun 2019 8:44 AM GMTలోక్ సభలో ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా సోనియాగాంధీ - మేనకాగాంధీ ఒకర్నొరకరు పలకరించుకున్నట్టుగా తెలుస్తోంది. పలకరించుకోవడం అంటే క్షేమ సమాచారాలు తెలుసుకోవడం కాదు కానీ, ముకుళిత హస్తాలతో ఒకరికి ఒకరు అభివాదం చేసుకున్నారట ఈ తోడికోడళ్లు.
ముందుగా సోనియాగాంధీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయగా, వెంటనే మేనక వంతు వచ్చింది. ఆమె బీజేపీ ఎంపీ అనే సంగతి తెలిసిందే. అయినప్పటికీ అక్క వెనుకే చెల్లెలు పేరు వచ్చినట్టుంది.
ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారాన్ని పూర్తి చేసిన సోనియాగాంధీ - ప్రమాణ స్వీకారానికి వస్తున్న మేనకకు అభివాదం చేశారు. ఒకరికొరు నమస్కారం పెట్టుకున్నారు.
ఇదేమంతా విశేషం కాదు కానీ - ప్రస్తుతం బీజేపీలో మేనకగాంధీ కొంచెం అసంతృప్తిలో ఉన్నారు. ఆమెకు, ఆమె తనయుడు వరుణ్ కు కమలం పార్టీలో పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదు. ఈ సారి మోడీ కేబినెట్లో కూడా మేనకకు స్థానం దక్కలేదు. దీంతో ఆమె బాగా అసంతృప్తిగా ఉన్నారని స్పష్టం అవుతోంది.
దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ నీడ తన మీద పడకుండానే మేనకాగాంధీ రాజకీయాల్లో రాణిస్తూ వస్తున్నారు. అయితే కమలం పార్టీలో కీలక పదవులు మాత్రం ఆమెకు, ఆమె తనయుడికి దక్కేలా లేవు. ఈ క్రమంలో సోనియాగాంధీతో మేనక - వరుణ్ లకు సఖ్యత ఏర్పడే అవకాశాలున్నాయా?