Begin typing your search above and press return to search.
వైరల్ గా మారిన మేనకాగాంధీ - సాక్షి మహారాజ్ వీడియోలు
By: Tupaki Desk | 13 April 2019 4:08 AM GMTఇందిరాగాంధీ కోడలు - బీజేపీ నేత మేనకాగాంధీ.. అదే పార్టీకి చెందిన నాయకుడు సాక్షి మహరాజ్ లకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆ వీడియోలు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా వారు ఓటర్లను బెదిరిస్తున్న ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ లో పోటీ చేస్తున్న కేంద్రమంత్రి మేనకా గాంధీ అక్కడ ప్రచారం చేస్తూ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన కొందరి ఓటర్లను బెదిరిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.ముస్లిం ఓటర్లు తనకు ఓటు వేయకుంటే తాను విజయం సాధించిన తర్వాత ఎవరికీ ఒక్క సహాయం కూడా చేయబోమని ఆమె చెప్పడం ఆ వీడియోలో కనిపిస్తోంది. ముస్లిం సామాజిక వర్గం వారు తనకు ఓట్లు వేసిన వేయకపోయినా గెలుపు మాత్రం తనదే అంటూ వారిని హెచ్చరించడం అందులో కనిపించింది. తన ఫౌండేషన్ ద్వారా రూ.1000 కోట్లు ముస్లింలకు ఖర్చు చేశామని తీరా ఎన్నికలు వస్తే మాత్రం ముస్లింలు బీజేపీకి ఓటువేయరని తమకు చాలా బాధ కలుగుతుందని చెప్పడం వీడియోలో ఉంది.
ఇక వివాదాలకు మారుపేరైన ఎంపీ సాక్షి మహారాజ్ కూడా అలాగే బెదిరించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఉన్నావ్ నుంచి పోటీ చేస్తున్న సాక్షి మహారాజ్ ... ‘‘ఓ సాధువు మీ ఇంటికొచ్చారు. ఆయన అడిగింది ఇవ్వకుంటే మీ కుటుంబంలోని సంతోషాన్ని తీసుకెళ్లిపోతాడు’’ అంటూ శపించారు. అంతేకాదు పురాణాల్లో మునులు శాపాలు పెట్టడం గురించి చెబుతూ ఓటర్లలో భయం కలిగించారు.
ఈ ఇద్దరు నేతలు ఓటర్లను ఇలా బెదిరించడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఓటర్ల మనసు గెలచుకోలేకపోయిన బీజేపీ నేతలు ఇలా భయపెట్టి - ప్రలోభపెట్టి ఓట్లు సాధించాలనుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.