Begin typing your search above and press return to search.
సీఎం నివాసాన్ని ముట్టడిస్తే.. అత్యాచార యత్నం కేసా?
By: Tupaki Desk | 24 Jan 2021 4:36 AM GMTఏపీ పోలీసులు వ్యవహరించిన తీరు మరోసారి ఆశ్చర్యపోయేలా చేయటమే కాదు.. విమర్శలకు అవకాశం ఇచ్చేలా ఉండటం గమనార్హం. తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం చేసిన వారిపై కేసును నమోదు చేసి కోర్టుకు తరలించారు. వారి రిమాండ్ కాపీలోని అంశాల్ని చూసిన సదరు న్యాయమూర్తి ఆశ్చర్యానికి గురయ్యారు. పోలీసులకు తలంటారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తెలుగునాడు విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో సీఎం నివాసాన్ని ముట్టడించే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో.. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా భారీ భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు.. ముట్టడికి ప్రయత్నించిన వారిని అదుపులోకి తీసుకున్నారు. సీఎం నివాసానికి దాదాపు కిలోమీటరు దూరంలోనే వారిని నియంత్రించారు.
అనంతరం వారిపై పలు కేసులు నమోదు చేసిన పోలీసులు శనివారం మంగళగిరి కోర్టు ఎదుట హాజరుపర్చారు. రిమాండ్ రిపోర్టులో ఉన్న అంశాల్ని చూసిన న్యాయమూర్తి ఆశ్చర్యానికి గురయ్యారు. దీనికి కారణం.. ఆ రిపోర్టులో అత్యాచార యత్నం అనే పదం వాడటంపై న్యాయమూర్తి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సీఎం నివాసాన్ని ముట్టడిస్తే.. అదెలా అత్యాచార యత్నం కేసు అవుతుందని పేర్కొనటంతో పాటు.. అసలు ఇదెలా అత్యాచార కేసు అవుతుందని పోలీసుల్ని నిలదీసినట్లుగా తెలుస్తోంది. దీంతో.. ఉలిక్కి పడిన పోలీసులు.. తమ రిమాండ్ కాపీల్ని వెనక్కి తీసుకొని.. విద్యార్థుల్ని తిరిగి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.
అక్కడ అత్యాచార పదాల్ని మార్చి.. మళ్లీ తీసుకొస్తామని చెప్పారు. కేసులున మోదు చేసే సమయంలో.. కంప్యూటర్ లోని పాత కాపీల్ని మార్చి కొత్త అంశాల్ని చేరుస్తుంటారు. ఈ క్రమంలో జరిగిన పొరపాటు కారణంగా ఇలాంటి తప్పులు దొర్లినట్లుగా తెలుస్తోంది. దీంతో.. రిమాండ్ కాపీని మార్పులు చేసి న్యాయమూర్తికి సమర్పించినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారం సంచలనంగా మారటంతో జిల్లా ఎస్పీ సోషల్ మీడియాలో వివరణ ఇచ్చారు. ముట్టడిలో పాల్గొన్న విద్యార్థుల ఎఫ్ఐఆర్ లో అత్యాచార యత్నం సంబంధిత సెక్షన్లు ఏమీ లేవన్నారు. టైప్ చేసే వేళ ఒక పదం మారటంతో ఈ అపార్థం తలెత్తినట్లుగా పేర్కొన్నారు.ఇదే పొరపాటును సదరు జడ్జి కానీ గుర్తించకపోతే పరిస్థితేమిటంటారు?