Begin typing your search above and press return to search.
టీడీపీ కేంద్ర కార్యాలయం కూల్చేయండి .. ఏమైందంటే ?
By: Tupaki Desk | 6 Dec 2019 11:01 AM GMTఆంధ్రప్రదేశ్ లో 2019 ఏప్రిల్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దారుణమైన పరాజయం పాలైన విషయం తెలిసిందే. టీడీపీ ఘోర పరాజయం కావడం తో కొద్ది రోజులు మౌనం గా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ..ఆ తరువాత పార్టీ నిర్మాణం పై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని అమరావతిలో నిర్మించారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలం అత్మకూరు పరిధిలో నూతనంగా నిర్మించిన ఈ కేంద్ర కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ సతీ సమేతంగా పాల్గొన్నారు
ఇకపోతే ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కి , టీడీపీ నేతలకి షాక్ ఇస్తూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి టీడీపీ కార్యాలయ భవనం అక్రమ నిర్మాణమని.. దానిని కూల్చివేసి, ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని హైకోర్ట్ లో పిటిషన్ వేశారుఈ మేరకు ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆత్మకూరు పరిధిలో ఉన్న వాగు పోరంబోకుకు చెందిన సర్వే నెంబరు 392లో 3.65 ఎకరాల భూమిని టీడీపీ కార్యాలయ నిర్మాణం కోసం 99 సంవత్సరాల పాటు లీజుకిస్తూ 2017లో రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందని పిటిషన్‌లో తెలిపిన ఎమ్మెల్యే ఆళ్ల , ఇది చాలా అక్రమం అని తన పిటిషన్ లో పొందుపరిచారు.
వాగులు, వంకలు, చెరువులు, నదీ పరివాహక ప్రాంతాల భూముల్ని ఇతరాలకు కేటాయించడం పర్యావరణ చట్టాలకు విరుద్ధమని గతంలో సుప్రీంకోర్టు చెప్పిందని , అలాగే ఈ వ్యవహారంలో అనేక చట్ట ఉల్లంఘనలు ఉన్నందున గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయడంతో పాటు అక్రమంగా కట్టిన టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేసి, తిరిగి ఆ భూమిని స్వాధీనం చేసుకునేలా అధికారులను ఆదేశించాలని హైకోర్టును కోరారు.