Begin typing your search above and press return to search.
మిస్సింగ్ పై స్పందించిన మంగళ గిరి ఎమ్మెల్యే
By: Tupaki Desk | 26 Dec 2019 8:10 AM GMTఏపీ కి 3 రాజధానులు అవసరం అంటూ ఏపీ సీఎం జగన్ చేసిన ప్రకటన తో అమరావతి రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే అమరావతిలో ఉన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రం ఈ ఆందోళనలపై స్పందించలేదు. రైతులను కలవలేదు. అసలు ఆయన మంగళగిరిలోనే లేరు
దీంతో నియోజకవర్గం లోని రైతులు, నిరసనకారులు తమ కష్టాలు చెప్పుకుందామంటే మా ఎమ్మెల్యే కనబడుట లేదు అంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు.
ఎట్టకేలకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి బయటకు వచ్చారు. ‘తాను ఎక్కడికి వెళ్లలేదని.. తన అన్న కుమారుడి వివాహానికి వెళ్లానని తెలిపారు. తాను కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వారిపై తర్వాత స్పందిస్తానన్నారు. 40 ఏళ్లుగా కుప్పం నియోజక వర్గానికి చంద్రబాబు వెళ్లడం లేదని.. ఆయన పై మిస్సింగ్ కేసు పెట్టాలని ఆళ్ల డిమాండ్ చేశారు.
అమరావతి ఆందోళనల నేపథ్యం లో అమరావతి ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేలు, పార్టీ అగ్రనేతలు గురువారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశమవుతున్నారు.