Begin typing your search above and press return to search.
ఆళ్ల చేసే పని చేస్తే..ఆయనకు మీరు ఫిదా కావటం ఖాయం!
By: Tupaki Desk | 28 May 2019 6:41 AM GMTహోరాహోరీగా సాగిన ఎన్నికల ఫలితాలు వెల్లడై వారం కూడా కాలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకును ఓడించి సంచలనం సృష్టించి అందరి దృష్టిని ఆకర్షించారు. నామినేషన్ వేసిన ఆయన తరఫు ప్రచారం చేయటానికి వచ్చిన పార్టీ అధినేత.. తమ పార్టీ అధికారంలోకి వచ్చినంతనే.. ఆయనకు మంత్రి పదవి ఖాయమని ఆ ప్రాంత ఓటర్లకు హామీ ఇచ్చేశారు. అంటే.. తాజా విజయంతో మంత్రి పదవి చేతికి దక్కనుందన్న మాట.
మరి.. అలాంటి వ్యక్తి తాజా ఫలితాల నేపథ్యంలో ఏం చేస్తుంటారంటే.. అభినందనలు.. సన్మానాలు.. రాజకీయ చర్చల్లో బిజీబిజీగా ఉంటారని ఎవరైనా చెబుతారు. కానీ.. ఆయన అందుకు పూర్తి భిన్నంగా. ఊహలకు అందనట్లుగా ఆయన వ్యవహారిస్తారు. తాజాగా తనకున్న పొలంలో పొలం పనులు చేస్తూ మీడియాకు కనిపించిన ఆయన వ్యవహారం మరోసారి ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆయన ఎవరంటారా? ఇంకెవరు మంగళగిరి ఎమ్మెల్యే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి. స్వయంగా రైతు అయిన ఆయనకు న్యాయ సంబంధమైన అంశాల్లో మాంచి పట్టు ఉంది.
ప్రభుత్వాలకు చుక్కలు చూపించేలా కోర్టు మెట్లు ఎక్కటంతో ఆయనకు ఆయనే సాటి. అలాంటి ఆయన సంచలన గెలుపు తర్వాత.. తనకు ఎంతో ఇష్టమైన పొలం పనులు చేస్తూ కనిపించి.. అందరికి కంటే భిన్నమైన వ్యక్తిగా నిలిచారు. ఆళ్లకు మంగళగిరి శివారులో పొలం ఉంది. దాన్లో ఆయన వ్యవసాయం చేస్తుంటారు.
మంగళగిరిలో నిర్వహించిన ప్రచారంలో జగన్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వంలో ఆళ్ల మంత్రిగా ఉంటారని ప్రకటించారు. దీంతో.. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక.. ఆయన ఎంపిక చేసే తొలి మంత్రివర్గంలోనే ఆళ్లకు స్థానం దక్కనుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సంతోషంతో వరుస పెట్టి ఉత్సవాలు చేసుకోవాల్సిన ఆళ్ల.. అందుకు భిన్నంగా వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండటం రోటీన్ కు భిన్నమైన వ్యవహారంగా చెప్పక తప్పదు.