Begin typing your search above and press return to search.
మాణికం మాష్టారు చెప్పిన ఏటీఎం ఏమిటో తెలుసా?
By: Tupaki Desk | 20 Nov 2020 11:10 AM GMTఏ మాటకు ఆ మాటే చెప్పాలి. నిత్యం కలహాలతో కొట్టుకు చచ్చే కాంగ్రెస్ నేతల్ని ఒక తాటి మీదకు తీసుకురావటానికి మించిన ఎక్స్ ర్ సైజ్ మరొకటి ఉండదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేస్తే.. అధికారాన్ని బంగారు పళ్లెంలో పెట్టి తెలంగాణ ప్రజలు ఇస్తారనుకొని అత్యాశకు పోయిన కాంగ్రెస్ నేతలకు.. అసలు విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఒకప్పుడు తిరుగులేని బలంతో ఉన్న కాంగ్రెస్.. ఈ రోజు ఉనికి కోసం పోరాడాల్సిన దుస్థితి.
ఎందుకిలా? అంటే..కాంగ్రెస్ చేజేతులారా చేసుకున్నదే. పార్టీ నేతల్లో లోపించిన ఐక్యత. ఎవరూ పైకి రాకూడదు.. తాము మాత్రమే హైలెట్ కావాలన్న కీర్తి కాంక్ష.. నాయకుడు ఎలాంటి వాడైనా సరే.. వారిని ఆమోదించే కన్నా.. వారిలో లోపాలు ఎత్తి చూపిస్తూ.. సహకరించకుండా చుక్కలు చూపించే తీరు.. చివరకు పార్టీ అడ్రస్ కే ముప్పు వాటల్లే వరకు వ్యవహారం వచ్చింది. ఇలాంటివేళలో రాష్ట్రపార్టీ ఇన్ ఛార్జి హోదాలో తమిళనాడు నుంచి వచ్చారు మాణికం ఠాగూర్.
ముక్కుసూటిగా.. మొహమాటం లేకుండా మాట్లాడే ఆయన పని తీరు చూస్తే.. రైట్ మ్యాన్.. రాంగ్ టైమ్ లో బాధ్యతల్ని తీసుకున్నారని చెప్పాలి. నిజానికి దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ హైలెట్ అయ్యింది కానీ.. వాస్తవానికి దుబ్బాకలో గ్రౌండ్ లెవల్లో భారీగా కష్టపడ్డారు కాంగ్రెస్ నేతలు. కానీ.. వారి శ్రమకు తగ్గ ఫలితం రాలేదనే చెప్పాలి. నిజానికి గడిచిన కొన్నేళ్లుగా చూస్తే.. రాష్ట్ర పార్టీ బాధ్యులుగా వ్యవహరించిన వారిలో మానికం ఠాగూర్ బెస్ట్ అని చెప్పక తప్పదు.
ఆయనలాంటి నేత పదేళ్ల ముందు పార్టీ బాధ్యుడిగా వచ్చి ఉంటే.. కాంగ్రెస్ పరిస్థితి మరోలా ఉండేదన్న మాట వినిపిస్తుంటుంది. కాంగ్రెస్ పార్టీ నేతల్ని దారికి తేవటమే కాదు.. రాష్ట్ర అధికారపక్షానికి చురుకుపుట్టేలా ట్వీట్లు చేయటంలో ఆయన ముందున్నారు. మోడీ సర్కారుకు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో కూటమి కడతానంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ కు తన ట్వీట్ తో షాకిచ్చారాయన.
కేసీఆర్ అందరిని మోసం చేయలేరంటూ చేసిన ట్వీట్ లో ఆయన తీరును కడిగిపారేసినంత పని చేశారు. ‘మోడీకి.. అమిత్ షాకు రాజ్యసభలో అవసరమైనప్పుడు మీరు సహాయం చేస్తారు. ఇప్పుడు సదస్సు పేరుతో మోడీషాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతిపక్ష నాయకుల్ని గందరగోళానికి గురి చేయాలనుకుంటున్నారా? చంద్రశేఖర్ రావు.. నవీన్ పట్నాయక్.. జగన్ మోహన్ రెడ్డిలు ఏటీఎంలు అని పేర్కొన్నారు. మాణికం మాష్టారి భాషలో ఏటీఎం అంటే.. ఎనీ టైం మోడీ అని. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. మోడీ మద్దతు దారులన్న విషయాన్నితన ట్వీట్ తో చెప్పేశారు. ఇంత సూటిగా విషయాన్ని చెప్పేయటం.. గులాబీ నేతలకు అస్సలు నచ్చలేదు.