Begin typing your search above and press return to search.

బాబు అండ్ కో క్యాష్ పోగేస్తున్నారా?

By:  Tupaki Desk   |   28 Feb 2018 1:57 PM GMT
బాబు అండ్ కో క్యాష్ పోగేస్తున్నారా?
X
ఎన్నికల సంవత్సరం ముందుకు వచ్చేసినట్టే. ఈసారి ఎన్నికల్లో విజయం సాధించాలంటే.. ఒక్కొక్క ఓటుకు ఎన్ని వేల వంతున డబ్బు చెల్లించి ఓటర్లను ప్రలోభపెట్టాలా అనే లెక్కలకు నాయకులు ఇప్పటినుంచే తెగిస్తూ ఉన్నారంటే అందులో అతిశయోక్తి ఎంతమాత్రమూ లేదు. ప్రజలకు డబ్బు పంచాలంటే అచ్చంగా క్యాష్ కొట్టాల్సిందే. ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్లు గట్రా కుదరకపోవచ్చు. మరి ఒక్కో నియోజకవర్గంలో అభ్యర్థులు కనీసం పదినుంచి ఇరవై కోట్ల రూపాయల క్యాష్ ఖర్చు పెట్టవలసి ఉంటుందనేది ఒక అంచనా. ఇలాంటి నేపథ్యంలో.. చంద్రబాబునాయుడు అండ్ కో రాబోయే ఎన్నికలకు సంబంధించి... ఆ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటినుంచి క్యాష్ పోగేయడం ప్రారంభిస్తున్నారు.

సాక్షాత్తూ చంద్రబాబునాయుడు కేబినెట్ లోని మంత్రి చెబుతున్న మాటలను గమనిస్తే ఇలాంటి సందేహాలే కలుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఒకవేళ ఇలాంటి ప్రయత్నాల్లో ఉండవచ్చు గానీ.. దాన్ని బయటపెట్టే మంత్రి ఎవరా? అని కంగారేం అక్కర్లేదు లెండి. ఆయన భాజపాకు చెందిన పైడికొండ మాణిక్యాల రావు. ఆయన స్వయంగా ఢిల్లీ వెళ్లి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసి... ఒక ఫిర్యాదు చేశారు. అది అచ్చంగా చంద్రబాబును ఉద్దేశించి కాదు గానీ.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మాత్రం నగదు కొరత ఏర్పడుతోంది.. ఇలా ఎందుకు జరుగుతోందో.. కాస్త వాకబు చేయించండి.. అని ఆయన పితూరీ చేశారన్నమాట. అంటే .. వందల కోట్ల రూపాయలను బ్యాంకులనుంచి నేరుగా బడాబాబులు తరలించేస్తున్నారు... అనేది ఆయన ఉద్దేశం లాగుంది. ఇండైరక్టుగా ఇది ముఖ్యమంత్రిని ఉద్దేశించి కూడా కావొచ్చునని కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి.

అయినా మంత్రి పైడికొండ గారికి.. ఏపీలో మాత్రమే ఇలా క్యాష్ కొరత ఎందుకు కనిపిస్తున్నదో అర్థం కాని సంగతి. ఈ సమస్య ఇంకా పలుచోట్ల ఉన్నది కూడా.

మరో సంగతి ఏంటంటే.. అరుణ్ జైట్లీనీ విజయవాడకు తీసుకు వచ్చి... ఆయన ద్వారానే ప్రెస్ మీట్ పెట్టించి.. ఆంధ్రప్రదేశ్ కు చేసిన సాయం మొత్తం అప్పజెప్పించాలని కూడా కమలదళాలు ప్లాన్ చేస్తున్నాయిట. అయినా ఇలా ప్రెస్ మీట్లు పెట్టి.. ఏకపక్ష ఉపన్యాసాలతో కాలహరణం చేసుకునే బదులుగా.. ఒకేసారి రాష్ట్రంనుంచి ఏ ఉండవిల్లి అరుణ్ కుమార్ లాంటివారినో సవాలు చేసి పిలిచి.. అరుణ్ జైట్లీ ని చర్చకు కూర్చోబెట్టవచ్చుగా.. ఎవరి సత్తా ఏంటో తేలిపోతుందిగా అని జనం అనుకుంటున్నారు.