Begin typing your search above and press return to search.
బయట పెట్టారు; శృతిహసన్‌ని ఏడిపించలేదు కానీ..!
By: Tupaki Desk | 11 April 2015 1:11 PM GMTచాలామంది గాలి మాటలుగా.. అర్థం లేని మాటలుగా కొట్టిపారేస్తారు కానీ.. నిప్పు లేందే పొగ రాదన్న విషయం మరోసారి నిరూపితమైంది. ఈ మధ్య విమానంలో ప్రయాణించే సమయంలో ఏపీ మంత్రి గట్టిగా మాట్లాడటం.. సినీ హీరోయిన్ శృతిహసన్ అభ్యంతరం చెప్పటం.. దానికి సదరు మంత్రివర్యులు తీవ్రస్థాయిలో మండిపడటం.. శృతి కంట కన్నీరు బటబటమని రాలటం లాంటి విశేషాలతో సోషల్‌మీడియా హోరెత్తిపోయింది.
అయితే ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద లోపం ఏమిటంటే.. సదరు మంత్రి ఎవరన్నది మాత్రం ఎవరూ బయటపెట్టలేదు. దీంతో.. ఎవరికి వారు వారికి తోచిన విధంగా అర్థాలు.. దీర్ఘాలు తీసుకోసాగారు. ఈ వ్యవహారంలో మంత్రి కామినేని హస్తం ఉందన్న పుకార్లు వ్యాపించటం.. ఆయన తత్తరపడి తనకు ఈ ఇష్యూలో ఎలాంటి సంబంధం లేదని.. తాను ఆ రోజు ఆ విమానంలో లేనని తేల్చేశారు.
మరి.. ఇంక ఎవరై ఉంటారని ఆలోచిస్తున్న సమయంలో.. ఈ సస్పెన్స్‌కు తెర దించుతూ.. తానే ఈ పని చేశానంటూ బయటకొచ్చారు దేవాదాయ శాఖామంత్రి పైడికొండల మాణిక్యాలరావు. అయితే.. శృతిహసన్ ఎపిసోడ్‌లో వినిపిస్తున్న కథనంలో కొంతమేర మాత్రమే నిజం ఉందని.. మిగిలినదంతా ఉత్తమాటలే అంటూ తేల్చేశారు.
ఇంతకీ మంత్రివర్యుల వారు చెప్పేదేమంటే.. తాను విమానంలో పెద్దగా మాట్లాడటం జరిగిందని.. ఎయిర్‌హోస్టెస్‌కి శృతి అభ్యంతరం చెప్పటం.. తాను మాట్లాడటం మానేయటం జరిగిందే తప్పించి.. ఇంకేం జరగలేదని.. మిగిలినదంతా ఉత్త మాటలే అంటూ ఆయన క్లారిటీ ఇస్తున్నారు. మరి.. మంత్రిగారు చెప్పిన విషయాన్ని నమ్మోచ్చా? శృతిహసన్ నిజంగా ఏడవలేదా? మంత్రిగారు తానేనంటూ బయటకొచ్చారు కాబట్టి.. ఈ ఇష్యూ మీద శృతి సైతం కాస్త మాట్లాడితే మరికాస్త క్లారిటీ వచ్చేస్తుందేమో.