Begin typing your search above and press return to search.
ఆందోళనకారులపైకి పోలీస్ వ్యాన్...
By: Tupaki Desk | 19 Oct 2016 4:30 PM GMTఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో అమెరికాకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపైకి పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ నిరసన కారుల పై పైకి పోలీసులు వ్యాన్లు ఎక్కించడంతో తీవ్ర ఉద్రిక్తతపరిస్థితులు ఏర్పడ్డాయి. అమెరికాకు వ్యతిరేకంగా మనీలాలో అమెరికా ఎంబసీ ఎదురుగా చేపట్టిన ఈ నిరసనలోని ఆందోళనకారులపై భద్రత అధికారులు అమానుషంగా ప్రవర్తించారు.
సాదారణంగా లాఠీచార్జ్ తోనో, వాటర్ స్ప్రే చెయ్యడం ద్వారానో లేక బాష్ప వాయువులు ప్రయోగించడంతోనో ఆందోళన కారులను చెదరగొట్టాల్సిన పోలీసులు... ముందుకు, వెనుకకు పోనిస్తూ ఆందోళనకారులపై వాహనాలు నడపడటంతో చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. ఇదే సమయంలో దొకినవారిని దొరికినట్ళు చితకబాదుతూ లాక్కెళ్లి వాహనాల్లో పడేశారు. ఈ సందర్భంలో అనేకమంది నిరసనకారులకు కాళ్లు, చేతులు విరిగాయి. అయితే, తొలుత ఆందోళనకారులు వ్యాన్ ను చుట్టుముట్టి పోలీసుల నుంచి లాక్కున్న కర్రలతో వాహనాన్ని కొట్టడం మొదలుపెట్టారు. దీంతో డ్రైవర్ వ్యాన్ ను పలుమార్లు జనంపైకి దూకించడంతో పెద్ద సంఖ్యలో జనం గాయపడ్డారు.
ఈ ఘటనలో భద్రతా సిబ్బందిపైకి ఎర్రరంగును చల్లిన సుమారు 23 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఫిలిప్పీన్స్ విషయంలో అమెరికా సైనిక జోక్యం ఉండకూడదంటూ ఈ ఆందోళన చేపట్టారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/