Begin typing your search above and press return to search.
మంత్రి ఇంటిని తగలబెట్టేస్తున్నారు!
By: Tupaki Desk | 1 Sep 2015 4:15 AM GMTమణిపూర్ అసెంబ్లీ చేసిన ఒక పనికి ప్రస్తుతం సౌత్ మణిపూర్ అంతా అట్టుడుకుతోంది. ఇన్నర్ లైన్ పర్మిట్ కు సంబందించిన వివాదాస్పద బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపడమే దీనికి కారణం. ఈ నిరసనలు ఇప్పటికే శృతిమించాయి. సోమవారం సాయంత్రం మొదలైన ఈ ఆందోళనలు అర్ధరాత్రి వరకూ కొనసాగాయి. ఈ క్రమంలో ఎవ్వరూ ఊహించని రీతిలో హింస చెలరేగిందనే చెప్పాలి.
ఇందులో భాగంగా మణిపూర్ దక్షిణప్రాంతంలోని చరచందూపూర్ లో ఆరోగ్యశాఖ మంత్రి పుంగ్ జతాంగ్ టాన్సింగ్ ఇంటికి అందోళనకారులు నిప్పుపెట్టారు. ఇదే క్రమంలో మరో ఐదుగురు ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పులు పెట్టి దహనం చేశారు. ఎంత పెద్ద ఎత్తున భద్రత కల్పించినా.. అది వీరి దూకుడును ఆపలేకపోయింది! మణిపూర్ అసెంబ్లీ ఆమోదం తెలిపిన బిల్లును నిరసిస్తూ మూడు గిరిజన విద్యార్థి సంఘాలు ఈ ఆందోళన చేపట్టాయి!
సృతిమించిన హింస జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో కొంతమంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. కాగా... పటేల్ రిజర్వేషన్ కోరుతూ గత పదిరోజులుగా గుజరాత్ అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. దీనిపై కూడా రాజకీయాలు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయ్ని తెలుస్తోంది!