Begin typing your search above and press return to search.
కేజ్రీకి చుక్కలు కనిపిస్తున్నాయి!
By: Tupaki Desk | 16 Jun 2017 11:08 AM GMTరాజకీయాల్లో నూతన శకానికి నాందీ పలుకుతానంటూ ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసి రంగంలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత - ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఇప్పుడన్నీ కష్టాలే ఎదురవుతున్నాయి. దేశ రాజధాని భద్రత విషయంలో మీ పెద్దనమేమిటంటూ కేంద్రంపై కాలు దువ్విన కేజ్రీకి... ఢిల్లీ సీఎంగా పదవీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అడపాదడపా దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అయతే వాటికి ఏమాత్రం వెరవకుండా... నరేంద్ర మోదీ కేబినెట్ లోని పెద్ద తలలను టార్గెట్ చేస్తూ కేజ్రీ పెద్ద యుద్ధానికే తెర తీశారు. ఆదిలో కాస్తంత అనుకూల పవనాలు వీచినా... ఇటీవలి కాలంలో ఆయనకు వరుసగా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి.
ఇప్పటికే తన కార్యాలయంలో పనిచేస్తున్న కార్యదర్శి స్థాయి అధికారిపై సీబీఐ దాడులు జరిగాయి. సాక్షాత్తు సీఎం కార్యాలయ స్థాయి అధికారి కార్యాలయంలోనే సీబీఐ దాడులు చేసిన సంగతి నాడు దేశవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారిన సంగతీ విదితమే. అదే క్రమంలో క్రికెట్ సంఘానికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీపై చేసిన ఆరోపణలు - న్యాయపోరాటం కేజ్రీకి చేదు అనుభవాలనే మిగిల్చింది. తాజాగా కేజ్రీ కేబినెట్ లో కేజ్రీ తర్వాత స్థానంలో ఉన్న ఆప్ కీలక నేత - ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపైనా సీబీఐ గురి పెట్టేసింది. గురి పెట్టడమే కాదండోయ్... ఏకంగా సిసోడియా కార్యాలయం, ఇళ్లపై సీబీఐ నేటి ఉదయం ఏకకాలంలో మూకుమ్మడి సోదాలకు దిగింది. పెద్ద మొత్తంలో ఆయన అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల కిందట సిసోడియా నివాసం, ఆయనకు సంబంధించిన ఇతర కార్యాలయాలపైన ఈ తనిఖీలు జరిగాయి.
ఢిల్లీ ప్రజలతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ మమేకమయ్యేందుకు రూపొందించిన కార్యక్రమం ‘టాక్ టు ఏకే’ ద్వారా సిసోడియా భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని, పెద్ద మొత్తంలో డబ్బు పోగేసుకొని అవినీతి చర్యలకు దిగారని సీబీఐకి ఫిర్యాదులు అందాయి. ఈ వ్యవహారంపై గత జనవరిలోనే ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ... తాజాగా ఆయన కార్యాలయం, ఇళ్లపై దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను ప్రశ్నిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాము నిర్వహించింది దాడులు కాదని, నిబంధనల అతిక్రమణల వివరాలు తెలుసుకునేందుకు వచ్చామంటూ ఓ సీబీఐ అధికారి చివరిగా మీడియాకు చెప్పడం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/