Begin typing your search above and press return to search.
షాకింగ్ ప్రశ్న:అయోధ్య విరాళాలేం చేశారు?
By: Tupaki Desk | 31 Dec 2015 7:24 AM GMTఅయోధ్యలో రామమందిరం నిర్మించడం తెరమీదకు వచ్చిన నేపథ్యంలో అధికార - ప్రతిపక్ష - ప్రజాస్వామ్య వాదులంతా తమ స్వేచ్ఛ కొద్ది కామెంట్లు చేసేస్తున్నారు. కేంద్రమంత్రి రాజేసిన నిప్పుతో కాంగ్రెస్ మరింత జోరుగా ముందుకువెళ్లింది. తాజాగా కేంద్రమంత్రి మహేశ్ శర్మ మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వం రామమందిర నిర్మాణానికి కృతనిశ్చయంతో ఉందని చెప్పారు. అయితే ఈ అంశంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకూ వేచి ఉంటామని, లేదా ఆలయ నిర్మాణంపై ''పరస్పర అంగీకారా''నికి వస్తామని ఆయన చెప్పారు. వీలైనంత త్వరగా రామమందిర నిర్మాణం పూర్తి కావాలని ప్రజలు కలలు కంటున్నారని ఆయన చెప్పారు. ఈ విషయంలో తమ పార్టీ - ప్రభుత్వం ఇప్పటికే తమ పంథాను స్పష్టం చేశాయని ఆయన చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి, లేదా అందరి సమ్మతితో మందిరాన్ని నిర్మించాలన్నదే తమ ధ్యేయం కాబట్టి తాము సమయం తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణ అంశం మళ్లీ ప్రముఖంగా ముందుకు వచ్చిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీపై ప్రశ్నల వర్షం కురిపించింది. అయోధ్యలో మందిర నిర్మాణం కోసం సేకరించిన నిధులేమయ్యాయని నిలదీసింది. గత 30 సంవత్సరాలుగా అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం సేకరించిన నిధుల వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు - మాజీ కేంద్రమంత్రి మనీష్ తివారీ అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పే బీజేపీ ఆ నిర్మాణం కోసం సేకరించిన నిధుల వివరాలను వెల్లడించి తన సైద్ధాంతిక పవిత్రతను చాటాలని పేర్కొన్నారు. వాస్తవానికి దేశ ప్రజలకు ఏం కావాలో బీజేపీ నాయకులకు తెలియదని ఆయన విమర్శించారు.
త్వరలో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలలో రామ మందిర నిర్మాణం పేరుతో ప్రజలను మతం ప్రాతిపదికన విడదీసి లబ్ధి పొందాలని ఆ పార్టీ భావిస్తున్నదని విమర్శించారు.1988-89 సంవత్సరంలో రామమందిర నిర్మాణం పేరుతో బీజేపీ సేకరించిన రమారమి 600 కోట్ల రూపాయలను స్విస్ బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు బిస్వా గుప్తా అనే ఆదాయపు పన్ను శాఖ అధికారి చేసిన ఆరోపణలను మనీష్ తివారీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అసలు 1986 నుంచి ఇప్పటి వరకూ రామమందిర నిర్మాణం కోసం సేకరించిన నిధుల మొత్తం ఎంతో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా యూపీ ప్రతిపక్ష పార్టీ అయిన బీఎస్ పీ మరో కొత్త ఆరోపణ తెరమీదకు తెచ్చింది. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని కోరేవారందరూ ఇంట్లోనే పుట్టిన ఉగ్రవాదులని బహుజన సమాజ్ పార్టీ (బిఎస్ పి) నేత స్వామీ ప్రసాద్ మౌర్య ఘాటుగా విమర్శించారు. రామమందిరం విషయం సుప్రీంకోర్టులో ఉండగా, దాని గురించి ప్రస్తావించేవారందరూ స్వదేశీ ఉగ్రవాదులని ఆయన ఆరోపించారు.
అయితే మౌర్య వ్యాఖ్యలను బిజెపి ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర శాఖ అధికార ప్రతినిధి విజయ్ బహదూర్ పాఠక్ ఖండించారు. ఈ వ్యాఖ్యలు హిందూ మనోభావాలను దెబ్బ తీశాయన పాఠక్ అన్నారు. గతంలో మౌర్య ఈ రకమైన వ్యాఖ్యలు చేశారని, హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసులు నమోదయ్యాయని పాఠక్ అన్నారు.
మొత్తంగా ఇపుడు బీజేపీ రాముడి చుట్టూ తిరుగుతుండగా..... దేశం అయోధ్యపై స్పందిస్తుండటం గమనార్హం.