Begin typing your search above and press return to search.

మీట్ బ్రదర్స్ పిచ్చ పరాకాష్ఠకు..?

By:  Tupaki Desk   |   1 April 2016 7:35 AM GMT
మీట్ బ్రదర్స్ పిచ్చ పరాకాష్ఠకు..?
X
కొంతమంది సెలబ్రిటీల తీరు కాస్త భిన్నంగా ఉంటుంది. ఇలాంటి వారు తరచూ వార్తల్లోకి ఎక్కుతుంటారు. తమ మాటలతో కొందరు.. తమ చేష్టలతో మరికొందరు మీడియాలో దర్శనమిస్తుంటారు. అయితే.. ఇలాంటి మాటలు.. చేష్టలు ఓ రేంజ్ వరకూ బాగానే ఉంటాయి. కానీ.. తాజాగా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా.. జంటపక్షులుగా పేరుప్రఖ్యాతులు పొందిన మీట్ బ్రదర్స్ తాజా స్టేట్ మెంట్ కాస్తంత కంపరాన్ని కలిగించేలా ఉంది.

సొంత సోదరులు కానప్పటికీ.. కాస్త ఒకేరకంగా ఉండే మన్ మీత్ సింగ్.. హర్మీత్ సింగ్ లు ఇద్దరూ తమ పేరును ‘‘మీట్ బ్రదర్స్’’గా చెప్పుకోవటం.. అందరిని వారిని అదే తీరులో వ్యవహరించటం తెలిసిందే. ఈ ఇద్దరూ కలిసి చేసిన బేబీ డాల్.. హైహీల్స్ వరుస హిట్లతో మాంచి జోరు మీదున్న వీరు.. తమ గురించిన కొన్ని ఆసక్తికర సంగతులు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా కాస్త హద్దులు దాటి తమ పిచ్చను బయటపెట్టారు.

తమ ఇద్దరి టేస్ట్ ఒకే రకంగా ఉంటుందని.. చాలావరకూ ఒకేలా వ్యవహరిస్తామని.. కొన్ని అంశాల్లోనే తమ టేస్ట్ లు వేరుగా ఉంటాయని చెప్పుకొచ్చారు. తామిద్దరం చాలా విషయాల్ని షేర్ చేసుకుంటామని.. చివరకు గర్ల్ ఫ్రెండ్స్ ను కూడా ఇద్దరం షేర్ చేసుకున్నట్లు వెల్లడించారు. జీవితంలో ఏదీ శాశ్వితంగా ఉండదన్నది తమ ఫిలాసఫీగా చెప్పుకొచ్చారు. ఈ ఇద్దరి పిచ్చ కాస్త పీక్ స్టేజ్ లో ఉన్నట్లుంది కదూ.