Begin typing your search above and press return to search.

ట్రంప్ విందుకు ముందు మోడీకి షాక్ లు..

By:  Tupaki Desk   |   25 Feb 2020 6:30 AM GMT
ట్రంప్ విందుకు ముందు మోడీకి షాక్ లు..
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి ఇస్తున్న విందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రావడం లేదు. ఈ మేరకు ఆయన మోడీ సర్కారుకు గట్టి షాకే ఇచ్చారు. ట్రంప్ విందుకు రాజకీయ ప్రముఖులు, దేశంలోని 8మంది సీఎంలు, పారిశ్రామిక, సినీ దిగ్గజాలు హాజరవుతున్నారు. పార్లమెంట్ లోని ప్రతిపక్ష నేతలను ఆహ్వానించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను కూడా పిలిచారు.

అయితే మన్మోహన్ సింగ్ తాజాగా ట్రంప్ విందుకు హాజరుకావడం లేదు. ఈ మేరకు విందుకు రాలేక పోతున్నానని విచారం వ్యక్తం చేశారు. ఈమేరకు రాష్ట్రపతి కార్యాలయానికి సమాచారం అందించారు. ఆరోగ్య కారణాలతోనే తాను హాజరు కావడం లేదని మన్మోహన్ సింగ్ రాష్ట్రపతి కార్యాలయానికి తెలిపారు.

అయితే మన్మోహన్ సింగ్ రాకపోవడానికి అసలు కారణం వేరే ఉందని సమాచారం. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ఆహ్వానం అందకపోవడంతోనే మన్మోహన్ ఈ విందుకు దూరంగా ఉన్నట్టు సమాచారం.

తమ అధినేత్రి సోనియాను ఆహ్వానించకపోవడం అవమానమని.. ఆమె పాల్గొనకుంటే తాము ఎలా పాల్గొంటామని రాజ్యసభ కాంగ్రెస్ పక్ష నేత గులాంనబీం ఆజాద్ కూడా విందుకు దూరంగా ఉంటున్నట్టు తెలిసింది. ఇప్పటికే లోక్ సభ కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి కూడా తాను వెళ్లడం లేదని ప్రకటించారు.

ఇతర దేశాల అధ్యక్షులు భారత్ వస్తే ప్రతిపక్షాలతో సమావేశం నిర్వహించడం సంప్రదాయం. బీజేపీ దీన్ని పక్కన పెట్టడం.. కాంగ్రెస్ అధినేత్రిని పిలవకపోవడంతో కాంగ్రెస్ నేతలందరూ ఈ విందుకు దూరమయ్యారు.