Begin typing your search above and press return to search.
పెద్దల సభకు మన్మోహన్..30 ఏళ్ల తర్వాత కొత్త స్టేట్ నుంచి..
By: Tupaki Desk | 13 Aug 2019 2:03 PM GMTమన్మోహన్ సింగ్. మౌనప్రధానిగా దేశంలో పదేళ్ల పాటు చరిత్ర సృస్టించారు. ప్రముఖ ఆర్తిక వేత్త అయిన ఆయనను దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు రాజకీయాల్లోకి తీసుకువచ్చి.. ఆర్థిక మంత్రిని చేశారు. ఆ తదనంతర కాలంలో ఆయన దేశ ప్రధానిగా చక్రం తిప్పారు. కాంగ్రెస్‌కు అత్యంత శ్రేయోభిలాషుల్లో ఒకరుగా గుర్తింపు మాత్రమే కాకుండా సోనియా - రాహుల్ గాంధీలకు కూడా వీర విధేయుడిగా గుర్తింపు సాధించారు. ఈ క్రమంలోనే ఆయన రాహుల్ ఎప్పుడు ప్రధాని పదవి కోరుకున్నా.. తాను తప్పుకొనేందుకు సిద్ధమని ప్రకటిస్తూ.. సంచలనాలను సృష్టించారు.
ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన ఈశాన్య రాష్ట్రం అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నికవుతూ.. వరుస ప్రధానిగా దేశ పగ్గాలు చేపట్టారు. సంస్కరణలకు పెద్దపీట వేస్తూనే.. మితభాషిగా గుర్తింపు పొందారు. అయితే, ఆయన హయాంలో నే బొగ్గు కుంభకోణం - 2జీ స్పెక్ట్రం కుంభకోణాలు చోటు చేసుకుని.. దేశాన్ని నవ్వుల పాలు చేశాయి. కీలకమైన నాయకులు జైలు పాలయ్యారు. ఈ పరిస్థితులే.. కాంగ్రెస్‌ను అధికారాన్ని దూరం చేశాయనడంలో సందేహం లేదు. ఈ సారి ఆయన రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో నిల్చున్నారు. 30 సంవత్సరాల తరువాత మన్మోహన్ సింగ్ బయటి రాష్ట్రం నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి.
ఈశాన్య రాష్ట్రం అస్సాం నుంచి వరుసగా రాజ్యసభకు ఎంపిక అవుతూ వస్తున్నారు. ఈ సారి అస్సాంలో రాజ్యసభ సీటును గెలిచే పరిస్థితులు లేవు. అందుకే ఆయన రాజస్థాన్ నుంచి బరిలో దిగారు. రాజస్థాన్ నుంచి మన్మోహన్ సింగ్ ఎన్నిక కావడం సులువే. ఇక్కడ రాజ్యసభ స్థానాన్ని దక్కించుకోవడానికి అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్యాబలం కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ అప్పటి వరకు ఉన్న బీజేపీ ప్రభుత్వం పోయి.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే రాజ్యసభకు టికెట్లు పెరిగాయి.
అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే. ఇక, తాను రిటైర్ అయినట్టే అని నిర్ణయించుకున్న సమయంలో మన్మోహన్ ఇలా .. యూటర్న్ తీసుకోవడం వెనుక కాంగ్రెస్‌లో లుకలుకలు వినిపిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ పగ్గాలు మరోసారి సోనియానే తీసుకుంటారని ప్రచారం జరుగుతున్న సమయంలో మన్మోహన్ కూడా రాజ్యసభకు ఎన్నికవుతున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వీరిద్దరే కలిసి కాంగ్రెస్ ను ఎన్నికల్లోకి తెచ్చేందుకు కృషిచేస్తారని అంటున్నారు. మరి రాహుల్ పరిస్థితి ఏంటనే విషయం మాత్రం క్లారిటీ లేక పోవడం గమనార్హం.