Begin typing your search above and press return to search.

బీజేపీ వైఫల్యాలకు నెహ్రూపై నిందలా? కడిగేసిన మన్మోహన్

By:  Tupaki Desk   |   17 Feb 2022 4:30 PM GMT
బీజేపీ వైఫల్యాలకు నెహ్రూపై నిందలా? కడిగేసిన మన్మోహన్
X
మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారు. ప్రధాని నరేంద్రమోడీపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సమస్యకూ జవహర్ లాల్ నెహ్రూనే ఎందుకు కారణంగా చూపుతున్నారని ప్రశ్నించారు. ప్రధాని పదవికి ఓ గౌరవం ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చురకలంటించారు.

రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ దేశఆన్ని విభజించలేదని.. ఎలాంటి నిజాలను దాచలేదని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. ఇప్పుడే ప్రజలను విడగొడుతున్నారని మండిపడ్డారు.

ఓవైపు నిరుద్యోగం.. ద్రవ్యోల్బణం పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రతి సమస్యకూ నెహ్రూనే కారణమంటూ మాట్లాడడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు.

తప్పులను కప్పిపుచ్చి ప్రధాని పదవికి మచ్చ తేవొద్దని హితవు పలికారు. తాను ప్రధానిగా ఉన్న పదేళ్లు.. చేతలతోనే మాట్లాడానని గుర్తు చేశారు. ప్రపంచం ముందు దేశ పరువు ఎన్నడూ తీయలేదన్నారు. 'నేను నోరు లేనివాడినని, అవినీతి పరుడినని.. బలహీనుడినని బీజేపీ.. ఆ పార్టీ బీ, సీ టీంలు ఆరోపించినా.. ఆ పార్టీల తీరేంటో ప్రజలకు తెలిసి వస్తుండడం పట్ల నేనిప్పుడు సంతోషంగా ఉన్నానని వ్యాఖ్యానించారు.

బీజేపీ ప్రభుత్వానికి ఆర్థిక విధానాలపై అసలు అవగాహన లేదని.. ఇది కేవలం దేశానికి సంబందించిన విషయమే కాదని పేర్కొన్నారు. విదేశాంగ విధానాలపైనా ప్రభుత్వం విఫలమైందన్నారు. నేతలను కౌగిలించుకోవడం.. చేతులు కలపడమే విదేశాంగ విధానం కాదని ప్రధాని తెలుసుకోవాలన్నారు.

ప్రస్తుత ప్రభుత్వ జాతీయవాదం అత్యంత ప్రమాదకమని వ్యాఖ్యానించారు. విభజించు, పాలించు అన్న బ్రిటీష్ నియమాలనే బీజేపీ పాటిస్తోందన్నారు. రాజ్యాంగ సంస్థలను బలహీనం చేశారని ఆరోపించారు.

ప్రస్తుత ఆర్థిక విధానాల్లో స్వార్థం దుఖం తప్ప ఏమీ లేదన్నారు. పంజాబ్ లో ప్రధాని భద్రతా లోపాలపై స్పందించిన మన్మోహన్ భద్రత పేరిట పంజాబ్ సీఎం చరణ్ జిత్ ఆ రాష్ట్ర ప్రజలను అవమానించే కుట్రను మోడీ చేస్తున్నారని మండిపడ్డారు. రైతు ఉద్యమ సమయంలోనూ పంజాబీలను దోషులుగా మోడీ చూపించే కుట్ర చేశారని ఆరోపించారు.