Begin typing your search above and press return to search.
దేశంలో ఉండాలంటే గోమాంసం తినొద్దు
By: Tupaki Desk | 16 Oct 2015 6:00 AM GMTఓపక్క దాద్రి ఘటన దేశాన్ని ఊపేస్తుంటే.. దానికి ఆజ్యం పోసేలా వ్యాఖ్యలు చేశారు హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్. గోమాంసం తిన్నారన్న ఆరోపణపై ఉత్తరప్రదేశ్ లోని దాద్రి గ్రామానికి చెందిన ఒక ముస్లింను కొట్టి చంపటం పెను వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారం రోజురోజుకీ పెరుగుతున్న పరిస్థితి.
దేశంలో ఇలాంటి పరిస్థితులకు నిరసనగా కొందరు కవులు.. మేధావులు తమకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన పురస్కారాల్ని వెనక్కి ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇలాంటి సందర్భంలో వివాదాన్ని సమిసి పోయేలా చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించట్లేదు. తమ వాదనను బలంగా వినిపించటానికి వారు సిద్ధం అవుతున్నారు. తాజాగా తాను ముఖ్యమంత్రి పదవిని చేపట్టి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంలో హర్యానా ముఖ్యమంత్రి ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పు సంచలనంగా మారాయి.
భారత్ లో ఉండాలనుకునే ముస్లింలు కచ్ఛితంగా గోమాంసం తినటాన్ని వదులుకోవాల్సిందేనని ఆయన చెప్పిన మాటలు మరెంత మంట పుట్టిస్తాయన్నది ఇప్పుడు పెద్దప్రశ్నగా మారింది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి.. ఇంత స్పష్టంగా గోమాంసం మీద వ్యాఖ్య చేయటం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఇక.. హర్యానాలో గోమాంసాన్ని తిన్న వారికి ఐదేళ్లు.. చంపిన వారికి పదేళ్లు శిక్ష విధిస్తూ అక్కడ చట్టాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యల్ని చూస్తే..
= భారత్ లో ముస్లింలు తమ జీవనాన్ని కొనసాగించొచ్చు.
= కానీ.. ఇక్కడ వారు ఉండాలంటే గోమాంసాన్ని తినే విధానాన్ని వదులుకోవాల్సిందే.
= గోవుల్ని హిందువులు అత్యంత పవిత్రంగా భావిస్తారు.
= వారి మనోభావాలు గౌరవించాలి.
= గోమాత.. భగవద్గీత.. సరస్వతీదేవీలను హిందువులు భక్తితో పూజిస్తారు. ఆవు మాంసం తింటూ ముస్లింలు హిందువుల పవిత్ర భావజాలాన్ని అవమానిస్తున్నారు.
= మనది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ అందరికి స్వేచ్ఛ అంటుంది. కానీ.. దానికి ఓహద్దు ఉంటుంది.
= ఇతరుల మనోభావాలకు భంగం కలిగించనంతవరకే స్వేచ్ఛకు పరిమితి ఉంటుంది.
= దాద్రి ఘటన నిజంగా జరగకుండా ఉండాల్సింది.
= అయితే.. మరణించిన ఇఖ్లాక్ అనే వ్యక్తి గోమాతను ఉద్దేశించి అవమానకర వ్యాఖ్యలు చేయటం మిగిలిన వారిని మరింత రెచ్చగొట్టాయి.
= అతని మాటల కారణంగానే బీభత్సకాండ చోటు చేసుకుంది.
= అయినా.. ఒక వ్యక్తిని కొట్టి చంపటం ముమ్మాటికి తప్పే.