Begin typing your search above and press return to search.
అలాంటి అమ్మాయిలంటే ఆ సీఎంకు భయమట
By: Tupaki Desk | 10 Feb 2018 6:46 AM GMTమద్యపానం.. ధూమపానం ఆరోగ్యానికి హానికరమంటూ భారీగా ప్రచారం చేస్తున్నప్పటికీ.. లిక్కర్ తీసుకునే యువత అంతకంతకూ పెరుగుతున్న వైనం ఇటీవల కాలంలో ఎక్కువ అవుతోంది. ఇదెంత ఎక్కువగా ఉందన్న విషయాన్ని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించటమే కాదు.. ఆందోళన వ్యక్తం చేయటం ఆసక్తికరంగా మారింది.
గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ నోట లిక్కర్ తాగే అమ్మాయిలకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిల్లో ఆల్కహాల్ సేవించే అలవాటు విపరీతంగా పెరిగిందని.. పరిమితికి దాటిపోయిందన్న ఆందోళనను వ్యక్తం చేశారు. బీర్లు ఎగబడి తాగేస్తున్నారని.. ఈ తీరు తనకెంతో భయాన్ని కలిగిస్తుందంటూ పారికర్ పేర్కొన్నారు. గోవా లో జరిగిన స్టేట్ యూత్ పార్లమెంట్‌కు హాజరైన యువతను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
తాను చేసిన వ్యాఖ్య అమ్మాయిలందరిని ఉద్దేశించి చేసింది కాదని.. కానీ.. మద్యం సేవించే అలవాటు అమ్మాయిల్లో ఎక్కువైందన్నారు. గడిచిన రెండేళ్లలో మద్యం సేవించే అమ్మాయిల సంఖ్య ఎక్కువైందని.. దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పారీకర్ వ్యాఖ్యానించటం గమనార్హం.
మద్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పారీకర్.. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా మీదా వ్యాఖ్యలు చేశారు. డ్రగ్ నెట్ వర్క్ ను అంతం చేసే ఆపరేషన్ కొనసాగుతుందన్నారు. కాలేజీల్లో డ్రగ్స్ కల్చర్ ఎక్కువగా ఉందని తాను అనుకోవటం లేదని.. అయితే మొత్తానికి లేదన్న వాదనను తాను వినిపించటం లేదని చెప్పటం విశేషం. గోవా యువత కష్టపడి పని చేయటానికి ఇష్టపడటం లేదన్న ఆవేదనను పారీకర్ వ్యక్తం చేశారు. ఏమైనా..ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటంలో తనకున్న ఇమేజ్ కు ఏ మాత్రం తగ్గకుండా పారీకర్ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పక తప్పదు.