Begin typing your search above and press return to search.
పాక్ పై అటాక్ స్కెచ్చంతా ఈయనదే!
By: Tupaki Desk | 29 Sep 2016 11:46 AM GMTమోడీ ఏరికోరి రక్షణ మంత్రిగా తెచ్చుకున్న వ్యక్తి ఆయన.. గోవాకు సీఎంగా ఉన్న మనోహర్ పారికర్ ను మోడీ ప్రధాని అయిన తరువాత రాజీనామా చేయించి మరి రక్షణ మంత్రిని చేశారు. అయితే... ఇంతవరకు ఆయన టాలెంటు బయటపడలేదు. కానీ... తాజాగా యూరీలో పాక్ ఉగ్రవాదుల అటాక్ తరువాత పరిణామాల్లో పారికర్ తానేంటో రుజువు చేసుకున్నారు. తాజాగా మన సైన్యం పాక్ లోకి మూడు కిలోమీటర్ల లోపలికి వెళ్లి ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయడంలో ప్రతి అడుగు పారికర్ కనుసన్నల్లోనే జరిగిందట. సైన్యం వేగంగా రాత్రిరాత్రికి కేవలం 40 నిమిషాల్లో పాకిస్థాన్ లోపలికి చొచ్చుకుపోవడం... మెరుపుదాడులు నిర్వహించడం... ధీమాగా వెనక్కి రావడం వరకు మొత్తం పారికర్ వ్యూహమేనట.
లక్ష్యాల ఎంపిక మొదలుకుని.. వాటిపై దాడులు ఎలా చేయాలి.. మనవైపు ఏమాత్రం నష్టం లేకుండా మళ్లీ తిరిగి ఎలా రావాలన్నది పాయింట్ టు పాయింట్ పారికరే స్కెచ్ వేశారని రక్షణ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
భారత త్రివిధ దళాధిపతులతో భేటీ జరిగిన సమయానికే భారత సైన్యం ఏడు ఉగ్రవాద శిబిరాలను ఎంచుకోవడం.. అందులోని ఉగ్రవాదులను మట్టుబెట్టడం, వెనుదిరగడం వంటి పూర్తి స్థాయి ప్రణాళికపై మినిట్ టు మినిట్ ప్రోగ్రాం ఫైల్ పారికర్ చేతుల్లో ఉందని రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి. అందులో ఉన్నట్టే పాక్ లోకి వెళ్లడం, ఎంచుకున్న ఏడు ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయడం, 38 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టడం.. అంతే వేగంగా వెనుదిరగడం జరిగిపోయాయి. అయితే.. ఇది ఇక్కడితో ముగిసిపోలేదని.. పారికర్ అమ్ములపొదిలో మరిన్ని ప్లాన్లు ఉన్నాయని చెబుతున్నారు. పారికర్ నెక్స్టు స్టెప్ ఏంటో చూడాల్సిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/