Begin typing your search above and press return to search.
బీజేపీకి పారికర్ కుమారుడు గుడ్‌బై.. ఇండిపెండెంట్‌గా బరిలోకి
By: Tupaki Desk | 22 Jan 2022 3:40 AM GMTగోవా రాజకీయాలు యూటర్న్ తీసుకున్నాయి. దివంగత మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ బీజేపీకి గుడ్‌బై చెబుతున్నట్టు ప్రకటించారు. త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు తెలిపారు. మనోహర్ పారికర్ ప్రాతినిధ్యం వహించిన పణజీ నియోజకవర్గం టిక్కెట్‌ను ఉత్పల్ పారికర్ ఆశించారు. ఇందుకోసం గట్టి ప్రయత్నమే చేసినప్పటికీ బీజేపీ టిక్కెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేకే పణజి టిక్కెట్ ఇచ్చేందుకు పార్టీ మొగ్గు చూపించింది.
దీంతో మనస్తాపం చెందిన ఉత్పల్ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. పణజి నియోజకవర్గానికి 25 ఏళ్ల పాటు మనోహర్ పారికర్ ప్రాతినిధ్యం వహించారు. కాగా, తాజా పరిణామలపై బీజేపీ గోవా ఇన్‌చార్జి దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. ''పారికర్ కుటుంబం బీజేపీకి సొంత కుటుంబం వంటిది. పారికర్ కోరిన నియోజకవర్గానికి ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయనను అక్కడ్నించి తప్పించడం సమంజసం కాదు. అయినప్పటికీ, రెండు సీట్లలో ఏదో ఒకచోట నుంచి ప పోటీ చేయమని ఉత్పల్‌కు ఆఫర్ చేశాం. ఆ దిశగా చర్చలు కూడా జరిపాం'' అని ఆయన చెప్పారు.
కాగా, ఉత్పల్ పారికర్‌కు ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమ పార్టీ సీటు ఆఫర్ చేశారు. శివసేన సైతం ఉత్పల్ పారికర్‌కు బాసటగా నిలిచింది. ఆయన పార్టీలోకి వస్తే పణజి అభ్యర్థిని ఉపసంహరించుకుని టిక్కెట్ కేటాయిస్తామని ప్రకటించింది. అయినప్పటికీ.. ఉత్పల్ మాత్రం ఆ పార్టీల్లోకి వెళ్లలేదు. ఇండిపెండెంట్ అభ్యర్థిగానే పోటీ చేస్తున్నారు. ఒకవేళ ఇక్కడ నుంచి గెలిస్తే.. ఆయన తిరిగి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని పరిశీలకులు అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.