Begin typing your search above and press return to search.
బాబు లాగే ఆయనకూ టైం ఉండడం లేదట..
By: Tupaki Desk | 4 Feb 2017 12:48 PM GMTఏపీ సీఎం చంద్రబాబు ఎప్పుడూ ఒక మాట చెబుతుంటారు. పాలనలో పడి ఇంటి గురించి, ఒంటి గురించి పట్టించుకోవడం మానేశానంటుంటారు. అంతేకాదు.. తన మనవడితో కూడా ఆడుకోలేకపోతున్నానని తెగ మథన పడుతుంటారు. తాజాగా కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ కూడా ఆ స్థాయిలో కాకపోయినా కాస్త అదే టోన్ లో తన కష్టాలు చెప్పుకొంటున్నారు. పనిలో పడి అస్సలు తీరికలేక బరువు తగ్గిపోయానంటున్నారు.
పారికర్ ఈ రోజు ఉదయం 7.10 కే అందరికన్నా ముందుగా తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడినప్పుడు, 'ఎందుకు సన్నబడిపోయారని' ఓ విలేకరి అడగగా, 'ఢిల్లీలో వుండడం వల్ల నాలుగు కిలోల బరువు తగ్గిపోయాను, నాకు గోవా ఆహారం అంటే ఎంతో ఇష్టం' అని సమాధానం చెప్పారు. అంతటితో ఆగకుండా ‘ఇప్పుడు మీ ఇష్టం.. దీనిని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా రాసుకోండి’ అంటూ నవ్వేశారు. గోవాకు సీఎంగా ఉన్నప్పటి కంటే ఢిల్లీ మంత్రిగా బిజీ అయిపోయానన్నట్లుగా పారికర్ మాటల్లో అర్థం ధ్వనించింది.
కాగా గోవాలో బీజేపీ గెలిస్తే పారికర్ మళ్లీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపడతారని చాలాకాలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో గోవాయే తనకిష్టం అంటూ పారికర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయమవుతున్నాయి. అయితే.. తాను పార్టీ మనిషినని, అధిష్ఠానం ఎలా చెబితే అలా నడుచుకుంటానని కూడా పారికర్ చెబుతున్నారు. మరి పార్టీ ఏం చెబుతుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/