Begin typing your search above and press return to search.

పాట పాడిన సైనికుడికి ప్రాణ హాని?

By:  Tupaki Desk   |   10 Oct 2016 6:28 AM GMT
పాట పాడిన సైనికుడికి ప్రాణ హాని?
X
పాకిస్థాన్ చెవులు రిక్కించి విను.. భారత్ తో పెట్టుకుంటే ప్రపంచ పటంలో నీ రూపు రేఖలు ఉండవు.

కశ్మీర్ ఎప్పటికీ ఉంటుంది కానీ.. పాకిస్థాన్ మాత్రం ఉండదు.. ఈ మాటలు అందరికీ గుర్తుండే ఉంటాయి.

"కాశ్మీర్‌ తో హోగా.. పాకిస్థాన్ నహీ హోగా" ఉరీ సైనికస్థావరాలపై జరిగిన ఉగ్రదాడి యావత్‌ భారతాన్ని కలిచివేసిన నేపథ్యంలో పాక్‌ కు వ్యతిరేకంగా మనోజ్‌ ఠాకూర్‌ అనే సైనికుడు జవాన్లతో నిండిన ఒక బస్సులో నిలబడి ఆలపించిన గీతం ఇది. పాకిస్థాన్‌ ను హెచ్చరిస్తూ సాగిన ఈ గీతం నాడు వైరల్‌ గా మారింది. ఈ సైనికుడి పాఠకు - నాటి పరిస్థితిలో భారతీయులున్న ఆవేశానికి వారంతా... వీర జవాన్లకు సలాం చెబుతూ ఈ వీడియోను విపరీతంగా షేర్‌ చేశారు. అయితే ఇప్పుడు ఈ పాట పాడిన సైనికుడు మనోజ్‌ ఠాకూర్‌ కు ఇబ్బందులు వస్తున్నట్లు తెలుస్తోంది.

ఉరీ ప్రాంతంలో ఉగ్రవాదులు దాడులకు తెగబడిన అనంతరం పాకిస్థాన్‌ ను హెచ్చరిస్తూ భారతీయుల్లో స్ఫూర్తి నింపేలా సాగిన ఈ పాట పాడిన సైనికుడు మనోజ్ ఠాకూర్‌ కు బెదిరింపులు ఎదురవుతున్నాయి. అతడిని చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయట. ఈ విషయాన్ని తోటి సైనికులు ఫేస్‌ బుక్‌‌ లో పోస్ట్‌ చేశారు. కాగా, ప్రస్తుతం మనోజ్‌ ఠాకూర్‌ కు కిన్నౌర్‌ ప్రాంతానికి పోస్టింగ్‌ వేశారు.

కాగా, ఉరీ ఉగ్రదాడిలో సుమారు 21మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోగా - నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతరం భారత సైనికులు.. పీవోకేలో జరిపిన సర్జికల్ దాడుల్లో సుమారు 40 మందికిపైగా ఉగ్రవాదులు హతయ్యారు. ఈ నేపథ్యంలో భారత్ - పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/