Begin typing your search above and press return to search.

సవాలు విసిరిన కమలనాథుడు ఆ ట్వీట్ ను ఏం చేయాలో చెప్పాడు

By:  Tupaki Desk   |   12 Feb 2020 4:16 AM GMT
సవాలు విసిరిన కమలనాథుడు ఆ ట్వీట్ ను ఏం చేయాలో చెప్పాడు
X
ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల్లో గెలుపు మీద బీజేపీ ప్రదర్శించిన ధీమా అంతా ఇంతా కాదు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. కేంద్రంలో కీలక స్థానంలో ఉండి కూడా ఢిల్లీ ఎన్నికల వేళ.. గల్లీలు తిరుగుతూ ఓట్లు వేయాలంటూ అమిత్ షా పడిన కష్టాన్ని మెచ్చుకోవాలి. ఢిల్లీ రాష్ట్ర పీఠాన్ని సొంతం చేసుకోవటానికి ఎంత ప్రయత్నించినా.. ఫలితం మాత్రం సానుకూలంగా రాలేదు.
ఢిల్లీ ఎన్నికల్లో తమ విజయాన్ని ఎవరూ ఆపలేరంటూ ప్రదర్శించిన ధీమా అంతా ఇంతా కాదు. బీజేపీ కి 48 సీట్లు వస్తాయి..

కావాలంటే ఈ ట్వీట్ సేవ్ చేసుకోండంటూ ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారి ఆత్మవిశ్వాసపు మాటలు ఇప్పుడు ఎటకారంగా మారాయి. ఊహించనంత దారుణ ఓటమికి గురైన వేళ.. మనోజ్ తివారి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్నికల వేళలో బీజేపీ నేతలు మరి ముఖ్యంగా మనోజ్ తివారి బడాయి మాటల్ని ప్రస్తావిస్తూ.. దాచుకోమన్న ట్వీట్ ను ఏం చేయాలంటూ ప్రశ్నించాడో మీడియా ప్రతినిధి.

బీజేపీ ఓడుతుందని తాను ఊహించలేదని.. కచ్ఛితంగా 48 స్థానాల్లో గెలుస్తుందని తాను అనుకున్నట్లు చెప్పిన ఆయన.. మీరు నా ట్వీట్ సేవ్ చేసుకున్నారా? ఫర్లేదు.. దాన్ని అలానే దాచుకోండంటూ చెప్పిన మాట విన్నోళ్లకు.. చింత చచ్చినా పులుపు మాత్రం చావలేదన్న సామెత చప్పున గుర్తుకొచ్చిన పరిస్థితి. ఓటమిని ఒప్పుకొని.. ఆత్మ విమర్శ చేసుకునే కన్నా.. అవసరం లేని ఆత్మ విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్న మనోజ్ తివారి లాంటి నేత మాటలు ఇప్పుడు ఎటకారంగా మారాయి.