Begin typing your search above and press return to search.
పుల్వామా దాడి..మోడీ సర్కారుపై కుటుంబ సభ్యులు ఫైర్
By: Tupaki Desk | 16 Feb 2019 5:07 PM GMTటెర్రరిస్టుల రాక్షసత్వానికి ప్రతీకగా మారిన పుల్వామా దారుణఘటనతో యావత్ భారత దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. పాకిస్థాన్ ఉగ్రోన్మాదంపై కోపం కట్టలు తెంచుకుంటోంది. దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్లకు కన్నీటి నివాళి అర్పిస్తున్నారు. దాయాదీ దేశంపై ప్రతికారం తీర్చుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పుల్వామా దాడికి నిరసనగా కశ్మీరం రగలుతోంది. జమ్మూ, శ్రీనగర్ సహా పలు ప్రాంతాల్లో బంద్ పాటిస్తున్నారు ప్రజలు. బంద్ సందర్భంగా జమ్మూలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
పుల్వామా దాడిలో అమరులైన సీఆర్ పీఎఫ్ జవాన్ల భౌతికదేహాలు వారి వారి గ్రామాలకు చేరుకున్నాయి. పుల్వామా దాడిలో 49 మంది జవాన్లు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ జవాన్లకు శుక్రవారం ఢిల్లీలో ప్రధాని మోడీ నివాళి అర్పించారు. ఇవాళ ఉదయం నుంచి జవాన్ల పార్థివదేహాలు ఆయా రాష్ట్రాలకు వెళ్లాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమరులైన జవాన్లకు ఘనంగా నివాళ్లు అర్పించాయి. భారీ సంఖ్యలో ప్రజలు.. జవాన్ల అంత్యక్రియలకు హాజరయ్యారు. వీరమరణం పొందిన వారిని కీర్తిస్తూ నినాదాలు చేశారు. జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ జవాన్లకు సెల్యూట్ చేశారు.
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. వారికి సంబంధించిన విషాదగాథలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తండ్రిని కోల్పోయిన బిడ్డలు - భర్తలను కోల్పోయిన భార్యలు.. ఇలా ఒక్కొక్కరి వ్యథలు కంటతడి పెట్టిస్తున్నాయి. ఇంతటి దారుణానికి పాల్పడిన ముష్కరులకు గట్టి గుణపాఠం చెప్పాలని జవాన్ల కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
పుల్వామా దాడిలో అమరుడైన సంజయ్ కుమార్ సిన్హా తండ్రి మహేంద్ర ప్రసాద్ కన్నీటిపర్యంతమయ్యాడు. సంజయ్‌కుమార్ కుమార్తె ఒకరు వివాహం కోసం సిద్ధమవుతున్నారు. ఇంకొకరు రెండో కుమార్తె రాక కోసం వేచిచూస్తున్నారు. అయితే ఉగ్రవాదులు ఆ జవాన్ల కలలపై నిప్పులు చల్లారు. మా కుమారుడు వీరమరణం పొందాడు. అందుకు నాకు గర్వంగా ఉంది. అతడికి పెండ్లి కావాల్సిన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈసారి వచ్చినప్పుడు పెద్ద కుమార్తెకు పెండ్లి ఖాయం చేద్దామని చెప్పాడు. కానీ మాలో విషాదం నింపి వెళ్లిపోయాడు అని భగల్‌పూర్‌కు చెందిన మరో జవాను రతన్ కుమార్ కుటుంబానిది మరో దీనగాథ. అతడికి నాలుగేండ్ల కుమారుడు ఉన్నాడు. అతడి భార్య ప్రస్తుతం గర్భవతి. విధుల్లో చేరిన తర్వాత సాయంత్రం ఫోన్ చేస్తాడని మేమంతా ఎదురుచూస్తున్నాం. అయితే గుండెలు పగిలే వార్త వినాల్సి వచ్చింది అని రతన్ తండ్రి రోదించాడు. `నా తండ్రిని, మన జవాన్లను పొట్టనబెట్టుకున్న ముష్కరులకు తప్పక శిక్షపడాలి. సరిహద్దుల్లో సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టి అయినా వారికి తగిన సమాధానం చెప్పాలి` అని పుల్వామాలో వీరమరణం పొందిన ఓ జవాను కుమార్తె డిమాండ్ చేసింది. గువాహటికి చెందిన సీఆర్పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ మనేశ్వర్ బాసుమతారికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మాకు న్యాయం కావాలి. పుల్వామా దాడికి బాధ్యులైన పిరికిపందలకు గట్టిగా బదులివ్వాలి అని మనేశ్వర్ కుమార్తె ఉద్వేగంగా పేర్కొంది.
నా భర్తను వారు చంపినట్లే.. వారినీ చంపేయండి అని కర్ణాటక రాష్ట్రం మాండ్యకు చెందిన సీఆర్పీఎఫ్ జవాను గురు భార్య కళావతి ప్రభుత్వాన్ని కోరారు. `గురువారం నా భర్త నుంచి కాల్ వచ్చింది. అయితే వేరే పనిలో ఉండి నేను మాట్లాడలేకపోయా. మళ్లీ నేను కాల్ చేస్తే.. ఆయన ఫోన్ కలవలేదు. చివరిసారి ఆయనతో మాట్లాడే అవకాశం వచ్చినా మాట్లాడలేకపోయా. నా తలరాత కూడా నా భర్త తలరాత మాదిరే ఉంది. నా భర్తను వారు చంపినట్లే.. వారిని కూడా చంపేయాలి` అని ఆమె విలపించింది. తన రెండు నెలల పసికందును చూడకుండానే ఓ జవాను వీరమరణం పొందారు. రాజస్థాన్‌లోని గోవింద్‌పురాకు చెందిన రోహితష్ లాంబా రెండేండ్ల కిందట సీఆర్పీఎఫ్‌లో చేరారు. ఏడాది క్రితం వివాహమైంది. గత డిసెంబర్‌లో లాంబా దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. త్వరలోనే తన బిడ్డను చూసేందుకు సెలవు పెట్టి గోవిందపురాకు రావాలనుకున్న లాంబా.. ఉగ్రదాడిలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. భర్త రాక కోసం ఎదురుచూస్తున్న భార్య.. అతడి మరణవార్త విని హతాశురాలైంది. ఉగ్రదాడిలో అసువులు బాసి ప్రదీప్ సింగ్ తండ్రి, రిటైర్డ్ ఎస్‌ఐ, అమర్ సింగ్ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఇటీవల 40 రోజులు సెలవు మీద ఇంటికి వచ్చిన తన భర్త ప్రదీప్ ఫిబ్రవరి 11న కశ్మీర్ వెళ్లారనీ, కానీ ఇంతలోనే తిరిగిరాని లోకాలకు తరలిపోతారని అనుకోలేదంటూ ఉగ్రదాడి విషాదంలో మునిగిపోయిన నీరాజ్ కన్నీటి పర్యంతమయ్యారు. జవాన్ల త్యాగాలను ప్రభుత్వం ఎన్నడూ గౌరవించలేదన్నారు. తన కుమారుడి త్యాగాన్ని ప్రజలు మరో మూడు రోజుల్లో మర్చిపోతారు. ఎవరి సొంత పనుల్లో వారు బిజీ అయిపోతారు. మురుపు దాడుల గురించి ప్రభుత‍్వం గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ టెర్రరిస్టుల భీభత్స దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా నిలబడి, దేశంలో పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడటం ప్రస్తుత తరుణంలో అత్యవసరమన్నారు.
కాగా, ఒడిశా రాష్ట్రం కటక్ జిల్లాలోని రతన్ పూర్ కి చెందిన మనోజ్ బెహరా 2006లో సీఆర్పీఎఫ్‌లో చేరాడు. రెండేండ్ల క్రితం వివాహమైంది. వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిదండ్రులకు బెహరా ఏకైక కుమారుడు. తాజాగా ఆయన కన్నుమూశారు. కుమార్తె మొదటి పుట్టినరోజు వేడుక కోసం గతేడాది నవంబర్‌లో బెహ రా స్వగ్రామానికి వచ్చాడు. రెండు నెలల తర్వాత జనవరిలో తిరిగి వెళ్లాడు. గురువారం ఉదయం అతడు తన భార్యకు ఫోన్ చేసి శ్రీనగర్‌కు వెళ్తున్నామని చెప్పాడు. చేరుకున్న తర్వాత మళ్లీ కాల్ చేస్తానని ప్రామిస్ చేశాడు. అయితే బెహరా ఇక తిరిగి రాలేడని అతడి భార్యకు చెప్పే ధైర్యం మాకు లేదు అంటూ బెహరా బావ దేవశిష్ బెహరా కన్నీటిపర్యంతమయ్యాడు.