Begin typing your search above and press return to search.

ఇదేనా మేక్ ఇన్ ఇండియా.?

By:  Tupaki Desk   |   4 Aug 2018 7:18 AM GMT
ఇదేనా మేక్ ఇన్ ఇండియా.?
X
విలన్ - నటుడు అయిన మన్సూర్ అలీఖాన్ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పెద్ద నోట్లు రద్దు చేసి వ్యవస్థలన్నింటిని కేంద్ర ప్రభుత్వం నాశనం చేసిందని ధ్వజమెత్తారు. ఐ క్రియేషన్స్ సంస్థ తాజాగా ‘పడిత్తవుడన్ కిళిత్తు విడవుమ్’ అనే రైతు కష్టాల నేపథ్యంలోని చిత్రాన్ని తీసింది. ఇందులో పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎలాంటి పరిస్థితులు ఏర్పాడ్డాయన్నదే కథాంశం.. ఈ చిత్రం ఆడియో గురువారం చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు మన్సూర్ అలీఖాన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడా విమర్శలు కోలీవుడ్ లో సంచలనమయ్యాయి.

మోడీ తీసుకొచ్చిన పెద్ద నోట్ల రద్దుతో తమిళ సినిమాతో పాటు దక్షిణాది సినిమా మొత్తం కుదేలయ్యిందని మన్సూర్ ఆవేదన వ్యక్తం చేశారు. 500 మంది చిన్న నిర్మాతలు కనిపించకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 8 రోడ్డు పథకాన్ని ప్రారంభిస్తానంటోందని.. దాని వల్ల ఎవరికి ప్రయోజనమని మండిపడ్డారు. ప్రశ్నిస్తే ఇది కేంద్ర ప్రభుత్వం పథకం అంటున్నారని.. రాష్ట్ర ప్రభుత్వం వెంట్రుకలు పీక్కోవడానికి ఉందా అంటూ మండిపడ్డారు. సినిమాలు - వ్యవసాయం - పరిశ్రమలను నాశనం చేసిన కేంద్రప్రభుత్వం ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా పథకంతో ఏం ఉద్దరిస్తుందని మన్సూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.