Begin typing your search above and press return to search.

మన్సుఖ్ హిరెన్ కేసు పత్రాలను ఎన్ఐఏకు ఇవ్వండి థానే కోర్టు ఆదేశాలు

By:  Tupaki Desk   |   24 March 2021 12:42 PM GMT
మన్సుఖ్ హిరెన్ కేసు పత్రాలను ఎన్ఐఏకు ఇవ్వండి థానే కోర్టు ఆదేశాలు
X
మన్సుఖ్ హిరెన్ కేసును స్వాధీనం చేసుకోవాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ ఏ) జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ‌ఐఏ) ను ఆదేశించిన మూడు రోజుల తరువాత, మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఎటిఎస్) ఇంకా సంబంధిత పత్రాలను అందజేయలేదని ఎన్‌ ఐఏ ప్రత్యేక కోర్టుకు తెలిపింది. దీనితో ముఖేష్ అంబానీ కి బెదిరింపు కేసుతో లింక్ అయి ఉన్న స్కార్పియో వాహనం యజమానిగా పోలీసులు విచారించిన మన్సుఖ్ హిరెన్ హత్య కేసులోని అన్ని పత్రాలను అందజేయాలని మహారాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్ కు థానే కోర్టు ఆదేశించింది. మన్సుఖ్ హిరెన్ కేసుకు సంబంధించి అన్ని వివరాలను జాతీయ దర్యాప్తు సంస్థ కు అప్పగించాలని థానే కోర్టు ఆదేశించింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఇల్లు, ఆంటిలా వెలుపల పేలుడు పదార్థాలు ఉన్నట్లు కనుగొన్న ఆకుపచ్చ రంగు స్కార్పియో యజమాని మన్సుఖ్ హిరెన్ మార్చి 5న థానేలో చనిపోయాడు. ఆ తరువాత, అతని మరణం పై మహారాష్ట్ర ఎటిఎస్ దర్యాప్తు చేస్తోంది. మార్చి 20న కేంద్ర హోం శాఖ దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించమని ఏజెన్సీని కోరింది. అయితే మహారాష్ట్ర ఎటిఎస్ అవసరమైన ఫైళ్లు, పేపర్లు మరియు కేస్ డైరీలను అందజేయడానికి ఆలస్యం చేస్తున్నట్లు మంగళవారం ఎన్ ఐ ఏ ప్రత్యేక కోర్టుకు తెలియజేసింది. మహారాష్ట్ర పోలీసు చీఫ్ కార్యాలయంతో వారు ఈ విషయాన్ని స్పష్టం చేశారని, అయినప్పటికీ ఏటీఎస్ అధికారుల నుండి తమకు కావాల్సిన సమాచారం లభించలేదని ఎన్ ఐ ఏ వర్గాలు తెలిపాయి. దీనితో ఆ ఆధారాలు ఇవ్వాలని థానే కోర్టు ఆదేశాలు జారీచేసింది.

ఈ కేసులో స్టేట్ ఏజెన్సీ ఏటిఎస్ ఇప్పటివరకు ఇద్దరిని అరెస్టు చేసి కనీసం 25 మంది వాంగ్మూలాలను నమోదు చేసింది. మంగళవారం, సచిన్ వాజేతో సంబంధం ఉన్నట్లు వోల్వో కారును, మన్సుఖ్తో హిరెన్ తో సంబంధం ఉన్న అరెస్టు చేసిన ముంబై పోలీసు అధికారులను సైతం విచారిస్తుంది . హిరెన్ కేసు బాధ్యతలు నిర్వర్తించిన వాజే ,హిరెన్ తో సంబంధాలపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది.