Begin typing your search above and press return to search.
సైకిల్ బ్యాచ్ సెంట్రల్ మినిష్టర్లయ్యారు..
By: Tupaki Desk | 5 July 2016 10:03 AM GMTకేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో కుల సమీకరణలు - ఎన్నికల లెక్కలు ఎన్ని ఉన్నా కొన్ని ప్రత్యేకతలూ ఆసక్తి కలిగిస్తున్నాయి. ముఖ్యంగా కొత్త మంత్రుల్లో నలుగురు అందరిలోనూ ప్రత్యేకంగా నిలుస్తున్నారు. ఆ నలుగురూ నిత్యం సైకిల్ పై పార్లమెంటుకు వచ్చే ఎంపీలు.. ఇప్పుడు కేంద్ర మంత్రులయ్యారు. దీంతో వారు ఇకపై సైకిల్ పై వస్తారా లేదంటే సెక్యూరిటీ ఇతర కారణాల వల్ల సైకిల్ ను విడిచిపెడతారా అన్నది చూడాలి.
మోడీ కేబినెట్ లో కొత్తగా చేరిన మంత్రుల్లో అనిల్ మాధవ్ ధవే - మాన్సుఖ్ భాయ్ మాంధవీయ - అర్జున్ రామ్ మేఘ్వాల్ - క్రిష్ణరాజ్ లు పార్లమెంటుకు సైకిల్ పై వచ్చేవారు. వీరిలో మాన్సుఖ్ భాయ్ మాంధవీయ క్లైమేట్ క్లబ్ లో సభ్యుడు కావడంతో ఆయన సైకిల్ పై రావడం అలవాటు చేసుకున్నారు. ఇక ధవే విషయానికొస్తే ఆయన తన సొంత పట్టణం భోపాల్ లోనూ సైకిల్ సవారీ చేసేవారు. ఢిల్లీలో అయితే దూరం వెళ్లాలంటే మెట్రో రైళ్లోనే ప్రయాణిస్తారు. మిగతా ఇద్దరూ కూడా సైకిల్ ప్రయాణాన్నే ఇష్టపడతారు.
అయితే.. మంత్రులయ్యాక కూడా సైకిల్ పైనే వెళ్లాలా వద్దా అనే విషయంలో వారు ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు. తాను పార్లమెంటుకు కూడా సల్వార్ కమీజ్ లో ఉన్నప్పుడే సైకిల్ పై వెళ్లేదాన్నని... చీరలో ఉంటే కారులోనే వెళ్తానని.. ఇకపైనా అదే విధానం పాటించాలనుకుంటున్నానని మహిళా మంత్రి క్రిష్ణరాజ్ అంటున్నారు. అనిల్ మాధవ్ ధవే మాత్రం తాను ఇక సైకిల్ వదిలేస్తానని పరోక్షంగా చెప్పారు. మంత్రిగా ఉంటూ తాను సైకిల్ పై వస్తే మీడియా ఇక తన వెంటపడి ఫొటోలు తీస్తుందని.. అందరిలో చర్చనీయం కావాల్సిన అవసరం లేదనిపిస్తోందని అంటున్నారు. మిగతా వారు కూడా దాదాపుగా సైకిల్ ను వదిలేస్తామనే అంటున్నారు.