Begin typing your search above and press return to search.
తెల్లోడి రాజ్యంలో టాప్ ఫైవ్ కుబేరుల్లో మనోళ్లు ఎందరో తెలుసా?
By: Tupaki Desk | 23 May 2021 4:30 PM GMTవందల ఏళ్లు మనల్ని పాలించి.. మన సంపదను దోచుకెళ్లిన తెల్లోడి గురించి తలుచుకున్న ప్రతిసారీ రక్తం మరుగుతుంది. తెల్లోడు మనల్ని వదిలేసి 70ప్లస్ ఏళ్లు అయినప్పటికి.. వందల ఏళ్లు మన సహజవనరుల్ని తీసుకుపోయి.. తన దేశాన్ని తిరుగులేని రీతిలో ఆర్థికంగా పరిపుష్టం చేసుకున్న వైనం తలుచుకున్న ప్రతిసారీ ఆగ్రహం తన్నుకు వస్తుంది. ఇవాల్టి రోజున వాడి భోగభాగ్యాలన్నింటిలోనూ మనోళ్ల శ్రమ.. మన సొమ్మే అన్న భావనకు గురి చేస్తుంది.అలాంటి తెల్లోడి రాజ్యంలో.. వారి గడ్డ మీద ఉంటూ.. అక్కడ వ్యాపారాలు నిర్వహిస్తూ ఎదిగిన మనోళ్లను చూస్తే గర్వానికి గురి కావాల్సిందే.
తాజాగా బ్రిటన్ లోని అపర కుబేరుల జాబితాలో ప్రవాస భారతీయులు సత్తా చాటుతున్నారు. సండేటైమ్స్ తాజాగా విడుదల చేసిన జాబితాలో ఆసక్తికర అంశాలున్నాయి. అగ్రశ్రేణి బ్రిటిష్ సంపన్నుల జాబితాలో టాప్ ఐదుగురిలో ముగ్గురు మన వారే కావటం గమనార్హం. ఇందులో రూ.2.21 లక్షల కోట్ల (2,146.5 కోట్ల పౌండ్లు) నికర ఆస్తులతో ముంబయిలో పుట్టి పెరిగిన డేవిడ్.. సైమన్ రూబెన్ సోదరులు రెండోస్థానంలో నిలవటం విశేషం.
గత ఏడాది రెండో స్థానంలో ఉన్న హిందుజా సోదరులు ఈసారి మూడో స్థానానికి పడిపోయారు. వారి ఆస్తి 1700 కోట్ల పౌండ్లుగా తేల్చారు. ఇక.. అంతర్జాతీయ ఉక్కు దిగ్గజం లక్ష్మీకాంత మిట్టల్ 1050 కోట్ల పౌండ్లతో ఐదో స్థానంలో నిలిచారు. గత ఏడాది 750 కోట్ల పౌండ్లతో 19వ స్థానంలో ఉన్న ఆయన.. తాజాగా 14 స్థానాలు ఎగబాకి ఏకంగా టాప్ ఫైవ్ లోకి వచ్చేయటం గమనార్హం. మొత్తం ఐదుగురు అపర కుబేరుల జాబితాలో మనోళ్లు ముగ్గురు ఉండటానికి మించిన సంతోషం ఏముంటుంది?