Begin typing your search above and press return to search.
కిడ్నాప్.. లొంగుబాటు.. ఎన్ కౌంటర్.. అరెస్ట్
By: Tupaki Desk | 20 Nov 2015 4:28 AM GMTచాలారోజులుగా స్తబ్దుగా ఉన్న వాతావరణంలో ఒక్కసారి కలకలం. మావోల పేరిట జరిగిన పలు పరిణామాలు ఒక్కరోజే చోటు చేసుకోవటం విశేషం. ఒకపక్క తెలంగాణ అధికారపక్ష నేతలు ఆరుగుర్ని మావోలు కిడ్నాప్ చేస్తే.. మరో వైపు.. ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఇంకోవైపు మావోలకు చెందిన ఒక అగ్రనేత పోలీసుల వద్ద లొంగిపోతే.. వీటన్నింటితో పాటు.. మావో అనుమానంతో పోలీసుల్ని కొందర్ని అదుపులోకి తీసుకోవటం గమనార్హం. వేర్వేరుగా తెలంగాణ.. ఛత్తీస్ గఢ్ లలో చోటు చేసుకున్న పలు పరిణామాల్ని చూస్తే..
టీఆర్ ఎస్ నేతల కిడ్నాప్
ఖమ్మం జిల్లాకు చెందిన ఆరుగురు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుల్ని మావోయిస్ట్ లు కిడ్నాప్ చేశారు. వీరంతా నియోజకవర్గ స్థాయి నాయకులు. కిడ్నాప్ అనంతరం మావోయిస్ట్ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరిట ఒక లేఖ విడుదలైంది. బుధవారం సాయంత్రం కిడ్నాప్ అయిన టీఆర్ ఎస్ నేతలంతా చర్ల మండలం పూసుగుప్ప గ్రామానికి వెళ్లారు. వీరంతా ప్రభుత్వం ఇవ్వనున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికిసంబంధించిన చర్చ కోసం వెళ్లినట్లుగా చెబుతున్నారు. భద్రచలం వెళ్లి వస్తామంటూ కిడ్నాప్ అయిన టీఆర్ ఎస్ నేతలు ఇళ్లల్లో చెప్పినట్లుగా చెబుతున్నారు.
మరోవైపు.. ఈ ఆరుగురు నాయకుల్ని కిడ్నాప్ చేసిన మావోలు మొత్తంగా మూడు డిమాండ్లను పెట్టారు. ఇందులో ప్రధానమైన డిమాండ్.. వరంగల్ జిల్లాలో బూటకపు ఎన్ కౌంటర్ కు పాల్పడ్డ పోలీసులపై చర్యలు. రెండో డిమాండ్.. ఖమ్మం జిల్లా నుంచి అదిలాబాద్ వరకూ నిర్వహిస్తున్న కూంబింగ్ ను నిలిపివేయాలి. మూడో డిమాండ్ గా.. ఎన్ కౌంటర్ పేరిట హత్యల్ని ఆపేయాలని లేదంటే.. టీఆర్ ఎస్ నేతల్ని లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు.
ఎంత భారీ ఎన్ కౌంటర్ అంటే..?
ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లా భెజ్జి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్ కౌంటర్ లో 15 మంది మావోయిస్ట్ లు మరణించినట్లు చెబుతున్నారు. అయితే.. ఘటనాస్థలంలో ఒక మహిళ మృతదేహంతో సహా మరో మృతదేహం మాత్రమే లభించటం గమనార్హం. మరణించిన మహిళా మావోను.. కుంట ఏరియా కమిటీ సభ్యురాలు జోగిగా గుర్తించారు. ఇంకోవైపు ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ జిల్లాలో గురువారం నలుగురు మావోలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా మందుగుండును స్వాధీనం చేసుకున్నారు.
లొంగిపోయిన అగ్రనేత..
అనారోగ్యంతో మావోయిస్ట్ అగ్రనేత అశోక్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. గాజర్ల అశోశ్.. అలియాస్ జనార్ధన్ ఉరఫ్ ఐతుగా పేరొందిన మావోయిస్ట్ అగ్రనేత పోలీసులకు లొంగిపోవటం ఈ మధ్య కాలంలో ఇదేనని పోలీసులు చెబుతున్నారు. ఇతని పేరు మీద రూ.20లక్షల రివార్డు ఉంది. తీవ్రమైన అనారోగ్యంతో బాధ పడుతున్న అశోక్.. శుక్రవారం వరంగల్ జిల్లా పోలీసుల వద్ద లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఛత్తీస్ గఢ్ లో దశాబ్ద కాలం పాటు పని చేసిన ఇతను లొంగిపోవటం మావోలకు తీరని లోటుగా చెబుతున్నారు. తాజాగా లొంగిపోయిన అశోక్.. వైఎస్ హయాంలో మావోలతో ప్రభుత్వం జరిపిన చర్చల్లో మావో ప్రతినిధిగా హాజరు కావటం గమనార్హం.
మావో సానుభూతి పరులంటూ..
ఒకపక్క మావోయిస్ట్ లు తెలంగాణ అధికారపక్షానికి చెందిన నియోజకవర్గ స్థాయికి చెందిన ఆరుగురు నేతల్ని కిడ్నాప్ చేసిన కొన్ని గంటల అనంతరం.. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో మావోయిస్ట్ సానుభూతి పరులంటూ ముగ్గురు యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రహస్యంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు కొత్తగూడెం ఓఎస్డీ కార్యాలయానికి తరలించారు. అయితే.. ఈ విషయం బయటకు రావటంతో.. కొత్తగూడెం తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసి.. ఆ ముగ్గురిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు.