Begin typing your search above and press return to search.
బలిమెల రిజర్వాయర్ లో డెడ్ బాడీ?
By: Tupaki Desk | 2 Nov 2016 7:38 AM GMTవారం కిందట ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లోని దట్టమైన అరణ్యంలో పోలీసులు 24 మంది మావోయిస్టులను హతమార్చిన ఘటన వేడి ఇంకా చల్లారలేదు. ఎన్ కౌంటర్ బూటకమంటూ... ఆహారంలో మత్తుమందు కలిపి మావోయిస్టులు నిద్రిస్తున్నాక కాల్చిచంపారని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాదు.. ఎన్ కౌంటర్ కు ప్రతీకారం తీర్చుకుంటామని... ఏపీ సీఎం చంద్రబాబు - ఒడిశా సీఎం నవీన్ ల అంతుచూస్తామని ఇప్పటికే హెచ్చరికలు జారీ అయ్యాయి. మరోవైపు ఎన్ కౌంటర్ జరిగేటప్పటికి అక్కడున్న మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఏమయ్యారన్న ప్రశ్న అందరినీ తొలిచేస్తుంది. అసలు పోలీసులు ఆర్కే కోసమే వల పన్నారని.. కానీ.. మృతుల్లో ఆయన లేకపోవడం... పౌరహక్కుల సంఘాలకు - మావోయిస్టులకు కూడా ఆయన ఆచూకీ తెలియకపోవడంతో రకరకాల వదంతులు వ్యాపిస్తున్నాయి. దీనిపై ఆర్కే భార్య హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం కూడా ఆర్కే ఏమయ్యారో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అంతేకాదు.. ఆర్కేకు ఎలాంటి హానీ తలపెట్టొద్దంటూ ఆదేశాలూ జారీ చేసింది. పోలీసులు మాత్రం ఆర్కే తమ వద్ద లేరని చెబుతున్నారు. మావోయిస్టులు - పౌర హక్కుల నేతలు పోలీసులపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఉంటే పోలీసుల అదుపులోనే ఉండాలని.. లేదంటే ఇప్పటికే మరణించి ఉంటే మృతదేహాన్ని రహస్యంగా ఖననం చేసి ఉంటారని అంటున్నారు.
ఇలాంటి తరుణంలో బలిమెల రిజర్వాయరులో ఒక మృతదేహం కనిపించడంతో అది ఆర్కే మృతదేహమన్న ప్రచారం నిన్న మన్యాన్ని కదిలించి వేసింది. అయితే... పోలీసులు మాత్రం అది ఆర్కే డెడ్ బాడీకాదని చెబుతున్నారు. కాగా ఎన్ కౌంటర్ నాటినుంచి ఏజెన్సీలో 13 మంది గిరిజనులు కనిపించకుండా పోయారు. సాధారణంగా సంతలకు వెళ్లిన గిరిజనులు రెండు - మూడు రోజుల తరువాత ఇళ్ళకు తిరిగి వస్తుంటారు. వారానికి పైగా వీరి ఆచూకీ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. 24న జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన వారి ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. వాటిలో కొన్నింటినే ప్రజా సంఘాల నాయకులు వరవరరావు తదితరులు గుర్తించారు. మిగిలిన వాటిని గుర్తించలేకపోయారు. అవి ఆచూకీ తెలియకుండా పోయిన గిరిజనుల మృతదేహాలా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
మరోవైపు ఎన్ కౌంటర్ కు నిరసనగా మావోయిస్టులు గురువారం అయిదు రాష్ట్రాల బంద్ కు పిలుపునివ్వడంతో పరిస్థితివేడెక్కింది. అంతేకాదు... మొన్నటి ఎన్ కౌంటర్ తో ఏవోబీలో మావోయిస్టులను ఏరేశామని సంబరపడుతున్న పోలీసులు షాక్ తినేలా మంగళవారం రాత్రి 30 నుంచి 50 మంది ఉన్న దళాలు ఏవోబీలోని పలు గ్రామాల్లో తిరిగాయట. బంద్ సందర్భంగా ఏఓబిలో మావోయిస్ట్ లు భారీ విధ్వంసానికి పాల్పడవచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు - ప్రజా ప్రతినిధులు - అధికారులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్ట్‌లు విధ్వంసానికి పాల్పడవచ్చని భావిస్తున్నారు. ఏజెన్సీలోని వివిధ ప్రాంతాల్లో కాంట్రాక్ట్ పనుల కోసం వినియోగిస్తున్న యంత్రాలను సమీప పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ల వద్ద భారీ బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నారు. 24న జరిగిన ఎన్ కౌంటర్ కు ధీటుగా జవాబు ఇచ్చి ఉనికి చాటుకోడానికి మావోయిస్ట్ లు ప్రయత్నిస్తారని భావిస్తున్నారు.. ఏఓబిలో ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో దుకాణాలు తెరవడానికి కూడా వ్యాపారులు భయపడుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/