Begin typing your search above and press return to search.
వణుకు పుట్టిస్తున్న మావోల హిట్ లిస్ట్!
By: Tupaki Desk | 26 Sep 2018 4:56 AM GMTమావోల ఉనికి పెద్దగా లేదన్న భరోసాతో ఇంతకాలం ధిలాసాగా తిరిగి ఏపీ నేతలకు.. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర నేతలకు తాజాగా చోటు చేసుకున్న లివిటిపుట్టు ఉదంతం ఇప్పుడు వణుకు పుట్టిస్తోంది. గడిచిన కొంతకాలంగా మావోలు చాప కింద నీరులా తమ బలాన్ని పెంచుకుంటూ పోయిన వైనం ఇప్పుడు కొత్త భయాలకు తెర తీస్తోంది. మొన్నటివరకూ మావోల పేరుతో వచ్చే హెచ్చరికల్ని పెద్దగా పట్టించుకోని నేతలంతా ఇప్పుడు మాత్రం ఫుల్ అలెర్ట్ అవుతున్నట్లుగా తెలుస్తోంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మావోల హిట్ లిస్ట్ లో 200 మంది నేతలు ఉన్నట్లుగా చెబుతున్నారు. అధికార పక్ష నేతలతో పాటు మాజీ నేతలు పలువురు ఈ జాబితాలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ముందస్తు సమాచారం ఇవ్వకుండా ప్రజాప్రతినిధులు బయటకు వెళ్లొద్దంటూ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. మావోల హిట్ లిస్ట్ లో తమ పేరు ఉందా? అంటూ వాకబు చేస్తున్న నేతలు లేకపోలేదు.
ఇదిలా ఉంటే.. 200 మందికి పైగా హిట్ లిస్ట్ చేసుకున్నట్లుగా సాగుతున్న ప్రచారానికి తగ్గట్లే కొందరునేతల పేర్లు భారీ ఎత్తున వినిపిస్తున్నాయి. తమ పేర్లు ఉన్నట్లుగా సాగుతున్న ప్రచారంతో సదరు నేతలు అంతకంతకూ వణికిపోతున్న పరిస్థితి. పైకి బింకంగా ఉన్నట్లు కనిపించినా.. నేతల్లో వణుకు స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మావోల హిట్ లిస్ట్ లో ఉన్న పేర్లకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. దాని ప్రకారం చూస్తే..
+ విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అయ్యన్నపాత్రుడు
+ పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి
+ అయ్యన్న సోదరుడు సన్యాసి పాత్రుడు
+ మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు
+ బాలరాజు సోదరుడు వినాయక్
+ గిడ్డి ఈశ్వరి వ్యక్తిగత కార్యదర్శి పోలుపర్తి గోవింరావు
+ బీజేపీ నాయకుడు లోకుల గాంధీ
+ కొయ్యూరు మండలం బూదరాళ్ల మాజీ సర్పంచ్ సూరిబాబు
+ కొయ్యూరు మండలం టీడీపీ నేత ఎం. ప్రసాద్
+ పెద బయలు మండలాధ్యక్షుడు ఉమామహేశ్వరరావు
+ మాజీ ఎంపీపీ జర్సింగి సూర్యనారాయణ
+ పెద బయలు మండలం జామిగూడ మాజీ సర్పంచ్ సుబ్బారావు
+ ఇంజిరి మాజీ సర్పంచ్ సత్యారావు
+ ఇంజిరి మాజీ సర్పంచ్ కామేశ్వరరావు
+ వీరే కాక చింతపల్లి మండలంలో 12 మంది.. జీకే వీధి మండలంలో 8 మందికి వార్నింగ్స్ ఇవ్వటం గమనార్హం.