Begin typing your search above and press return to search.
ఆర్కే పోలీసుల అదుపులో లేరా..?
By: Tupaki Desk | 3 Nov 2016 10:35 AM GMTమావో అగ్రనేత ఆర్కే ఎక్కడున్నారు? ఇప్పుడీ సందేహం అందరి మెదళ్లను తొలిచేస్తోంది. ఒడిశా – ఆంధ్రా సరిహద్దుల్లో ఉన్న జరిగిన భారీ ఎన్ కౌంటర్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు మరణించటమే కాదు.. ఆర్కేను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. తొలుత ఆర్కేకు గాయాలు అయినట్లుగా ప్రచారం జరగ్గా.. తర్వాత మాత్రం ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు.
ఆర్కే జాడకు సంబంధించి మావోలు కూడా ఎలాంటి ప్రకటన చేయకపోవటం.. ఆయన ఆచూకీ గురించి స్పష్టత లోపించటంతో ఆయన సతీమణి శిరీష హైకోర్టులో పిటీషన్ వేశారు. మానవహక్కుల కార్యకర్తలు ఆర్కే జాడ గురించి వెల్లడించాలని పోలీసులను కోరుతున్నారు. ఇదిలా ఉండగా.. ఆర్కే ఆచూకీపై హైకోర్టు స్పందించి..ఆయనకు సంబంధించిన వివరాల్ని వెల్లడించాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. తాజాగా రియాక్ట్ అయిన ఏపీ సర్కారు.. ఆర్కే తమ అధీనంలో లేరని స్పష్టం చేసింది. ఈ వివరాల్ని హైకోర్టుకు వెల్లడించింది.
ఇదిలా ఉండగా..నిన్న ఒక మీడియా సంస్థకు ఫోన్ చేసిన మావో ప్రతినిధి.. ఆర్కే జాడ గురించి నేరుగా స్పందించకుండా.. సేఫ్ గానే ఉన్నారంటూ వ్యాఖ్యానించటం గమనార్హం. మరోవైపు.. ఆర్కే జాడ గురించి దాఖలైన వాజ్యంపై హైకోర్టు విచారిస్తూ.. పోలీసులు అధీనంలో ఆయన ఉన్నట్లుగా పిటీషన్ దారు పేర్కొనటంపై ప్రశ్నిస్తూ ఇందుకు సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. దీనికి స్సందించిన శిరీష తరఫు లాయర్లు.. తమకు పది రోజుల సమయం కావాలని కోరారు. ఇదిలా ఉండగా.. ఆర్కేపై నలభైకు పైగా కేసులు ఉన్నాయని విశాఖపట్నం రూరల్ ఎస్పీ హైకోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొనటం గమనార్హం. ఆర్కే ఆచూకీపై తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. ఆయన పోలీసుల అధీనంలోనే ఉన్నారన్న సమచారాన్ని నిరూపించే సాక్ష్యాన్ని ఆయన సతీమణిపై పడిందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/