Begin typing your search above and press return to search.

కేసీఆర్ అలెర్ట్ కావాల్సిన కీలక పరిణామం

By:  Tupaki Desk   |   29 Jan 2020 4:42 AM GMT
కేసీఆర్ అలెర్ట్ కావాల్సిన కీలక పరిణామం
X
విన్నంతనే ఉలిక్కిపడే ఉదంతంగా దీన్ని చెప్పాలి. మావోల ప్రభావం అంతగా లేదనుకునే వేళ.. తమను తేలిగ్గా తీసుకోకూడదన్న సందేశాన్ని మావోలు తాజా ప్రకటనతో స్పష్టం చేశారని చెప్పాలి. ఇటీవల కాలంలో తగ్గిన తమ ఉద్యమ కార్యకలాపాల్ని మరింత బలోపేతం చేసుకునేందుకు వీలుగా మావోలు ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్న సమాచారం ఇప్పుడు కలకలం రేపుతోంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా మావో సెంట్రల్ కమిటీ కొత్త కేంద్ర కమిటీని ఎన్నుకుంది. 21 మందితో కూడిన మావోయిస్టు కేంద్ర కమిటీ జాబితా ఒకటి బయటకు వచ్చింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ సెంట్రల్ కమిటీలో పది మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికి చోటు లభించటం.

ఏపీకి చెందిన ఇద్దరు.. మహారాష్ట్ర.. పశ్చిమబెంగాల్ కు చెందిన ఇద్దరేసి చొప్పున సెంట్రల్ కమిటీలో స్థానం దక్కిన విషయం తాజాగా బయటకు వచ్చింది. మావో పార్టీ సెంట్రల్ కమిటీ సెక్రటరీగా పార్టీ సీనియర్ నేత 69 ఏళ్ల నంబాల కేశవరావును పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. తెలుగు రాష్ట్రాల్లో మావోల ప్రభావం బాగా తగ్గిపోయిందనుకున్న వేళ.. అందుకు భిన్నంగా ఒక్క తెలంగాణ నుంచే పది మంది ఎన్నిక కావటం చూస్తే.. తెలంగాణ విషయంలో మావో పార్టీ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్న భావన కలగటం ఖాయం. ఈ సమాచారం ముఖ్యమంత్రి కేసీఆర్ మరింత అలెర్ట్ కావాల్సిన అవసరాన్ని చెబుతుందని చెప్పక తప్పదు.