Begin typing your search above and press return to search.

కవితక్క సమాధానం చెప్పలేని ప్రశ్న

By:  Tupaki Desk   |   25 Sept 2015 12:28 PM IST
కవితక్క సమాధానం చెప్పలేని ప్రశ్న
X
ప్రశ్న ఏదైనా వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడేయగల వాగ్ధాటి ఉన్న తెలంగాణ నేతల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తె.. ఎంపీ కవిత ఒకరు. అయితే.. ఎప్పటి మాదిరి తనను అడిగే ప్రశ్నలకు ఆమె వెనువెంటనే సమాధానాలు చెప్పే పరిస్థితి ఉండకపోవచ్చన్న భావన తాజా ఘటనను చూస్తే అర్థమవుతుంది. ఇటీవల వరంగల్ జిల్లాలో మావోల ఎన్ కౌంటర్ జరగటం.. అందులో ఎంటెక్ చదువుతున్న శ్రుతి ఉండటం తెలిసిందే.

తాజాగా ఆమె సంస్మరణ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె తండ్రి ఓ కవిత చదివి వినిపించటం.. దాన్ని విన్న వారంతా కంట తడి పెట్టే పరిస్థితి. ఈ సందర్భంగా ఆయన వేసిన ఒక సూటి ప్రశ్న పలువురిని ఆలోచనలో పడేసింది. తన కూతురు చనిపోయినందుకు తాను బాధ పడటం లేదని చెప్పిన ఆయన.. తన కుమార్తె ఒక ఆశయ సాధన కోసం చనిపోయిందంటూ వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో ముఖ్యమంత్రి కుమార్తె కవితను ఉద్దేశించి ఒక ప్రశ్న సంధించారు. బతుకమ్మ ఆడే కవితకు.. ఎన్ కౌంటర్ కు ఒక మహిళ బలి కావటం బాధ కలిగించలేదా? అని ప్రశ్నించారు. అత్యంత దారుణంగా ఎన్ కౌంటర్ చేసిన ఈ ఘటనపై ఎంపీ కవిత ఎందుకు స్పందించలేదన్న ప్రశ్నకు ఆమెను అభిమానించే వారే కాదు.. ఎంపీ కవితకు కూడా ఈ ప్రశ్న కాస్త ఇబ్బంది కలిగించటం ఖాయం.