Begin typing your search above and press return to search.
పోలవరం ఆపకపోతే చంపేస్తాం
By: Tupaki Desk | 6 Sep 2015 6:24 PM GMTఏపీలో ని పోలవరం వద్ద నిర్మించే భారీ బహుళార్థక సాథక ప్రాజెక్టు పోలవరాన్ని ఆపకపోతే ప్రజా ప్రతినిధులను చంపేస్తామంటూ మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లాలో మావోల పేరుతో వెలసిన ఈ పోస్టర్లు రెండు తెలుగు రాష్ర్టాల్లోను పెద్ద కలకలం రేపాయి. ఖమ్మం జిల్లా చర్ల మండలం గోటిగూడెం లో మావోయిస్టులు పేరిట ఈ పోస్టర్లు ఏర్పాటయ్యాయి.
ఆ పోస్టర్ల లో పోలవరం ప్రాజెక్టును తక్షణమే ఆపకపోతే ప్రజాప్రతినిధులను చంపేస్తామని పేర్కొన్నారు. అలాగే భద్రాచలం శ్రీరాముల వారి ఆలయ భూములను కూడా పేదలకు పంచాలని వారు తమ డిమాండ్లలో పేర్కొన్నారు. ఈ పోస్టర్లను వెంకటాపురం జోనల్ ఏరియా కమిటీ పేరుతో అంటించారు. మావోయిస్టుల హెచ్చరికల తో అసలు ఈ పోస్టర్లను ఎవరు ఏర్పాటు చేశారనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇంతకు మావోయిస్టులు ఏ రాష్ర్ట ప్రజా ప్రతినిధులకు తమ హెచ్చరికలు జారీ చేశారో అర్థం కావడం లేదు. పోలవరం ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం నిర్మించనుంది. మావోయిస్టులు పోస్టర్లు తెలంగాణలో వెలశాయి. ఈ పోస్టర్లు వేసినట్టు ప్రకటించుకున్న వెంకటాపురం జోనల్ ఏరియా కమిటీ కూడా తెలంగాణలోనే ఉంది. అలాగే వీళ్లు పోలవరం ఆపాలని ఏపీ ప్రభుత్వానికి పరోక్షంగా హెచ్చరికలు చేసినట్లు ఉంటే..భద్రాచలం దేవస్థానం భూములు పేదలకు పంచాలని అటు తెలంగాణ ప్రభుత్వానికి కూడా వార్నింగ్ ఇచ్చినట్లు అర్థమవుతోంది.