Begin typing your search above and press return to search.
బాబు కొత్త ఇంటిపై మావోయిస్టుల రెక్కీ?
By: Tupaki Desk | 15 April 2017 6:04 AM GMTపక్షి కన్ను కూడా పడకుండా.. చీమకు కూడా తెలియకుండా కట్టుకున్న చంద్రబాబు కొత్త ఇంటిపై మావోయిస్టులు రెక్కి నిర్వహించినట్లుగా తెలుస్తోంది. అది కూడా చంద్రబాబు కొత్తింటికి గృహ ప్రవేశం చేసిన రోజునే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
నిజానికి చంద్రబాబు జూబ్లీ హిల్సులో ఈ ఇల్లు కడుతున్నప్పటి నుంచి అటువైపు ఎవరినీ రానివ్వకుండా ఏపీ పోలీసులతోనే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆ మార్గంలో ఇల్లు ఉన్న కొద్ది మంది ప్రముఖులకు తప్ప ఇతరులెవరినీ రానివ్వకుండా ఆ మార్గంలో రాకపోకలను నిషేధించారు. అయితే.. ఇల్లంతా పూర్తయి ఈ నెల ఏప్రిల్ 10న గృహప్రవేశం చేసిన రోజున మాత్రం ఒక గుర్తు తెలియని మహిళ ప్రవేశించి చంద్రబాబు - ఆయన సతీమణిలను పూర్తిగా అనుసరించినట్లు పోలీసు వర్గాల నుంచి తెలుస్తోంది.
చంద్రబాబు ఇంట్లోకి ప్రవేశించిన ఆమె తన సెల్ ఫోన్ లో ఫోటోలు తీసే ప్రయత్నం చేసిందని.. దాంతో అక్కడి సెక్యూరిటీ అధికారి ఒకరు ఆ మహిళను తమ ఆధీనంలోకి తీసుకుని విచారించగా తాను చంద్రబాబు కోడలు బ్రాహ్మణి స్నేహితురాలినని, ఆమె ఆహ్వానం మేరకే వచ్చానని చెప్పిందని సమాచారం. అయినా వారు నమ్మకుండా వెంటనే స్థానిక పోలీసుల సహాయంతో విచారించగా షాకింగ్ న్యూస్ బయటపడినట్లు తెలుస్తోంది. ఆమెకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని, చంద్రబాబు కదలికలపై ఆరా తీసేందుకే ఆమె వచ్చిందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. పైగా చంద్రబాబు కోడలు బ్రాహ్మణితో ఈ అంశాన్ని ప్రస్తావించగా తన స్నేహితులు ఎవరినీ గృహ ప్రవేశ కార్యక్రమానికి ఆహ్వానించలేదని చెప్పారట.
మరోవైపు సీసీ కెమేరాల ఫుటేజిని పోలీసులు చూడగా గృహప్రవేశానికి రెండు రోజుల ముందునుంచే ఆమె ఆ ప్రాంతంలో తిరిగినట్లు ఆధారాలు దొరికాయట. ఈ విషయం బయటకు పొక్కకుండా అటు చంద్రబాబు భద్రతా సిబ్బంది - ఇటు తెలంగాణ పోలీసులు జాగ్రత్త పడ్డారు. గృహ ప్రవేశం తర్వాత సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన చంద్రబాబు ఇంటి ఫోటోలు సదరు మహిళ వాట్సప్ ద్వారా పంపించినవేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల అదుపులో ఉన్న మహిళను ఇంకా విచారిస్తూనే ఉన్నారని ఆమె ఎవరన్నది నిర్ధారణ అయ్యాక పోలీసులు మీడియా ముందు ఆమెను ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/