Begin typing your search above and press return to search.
ఎమ్మెల్యే హత్య.. అసలేం జరిగింది.?
By: Tupaki Desk | 23 Sep 2018 11:08 AM GMTఅరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు - మాజీ ఎమ్మెల్యే శివేరు సోములను మావోయిస్టు కాల్చిచంపడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. కొన్నేళ్లుగా ఎటువంటి మావోయిస్టు కార్యకలాపాలు సాగని సమయంలో వీరిద్దరి హత్య ఏపీలో సంచలనం సృష్టించింది. మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిందని పోలీసులు లైట్ తీసుకున్న నేపథ్యంలో ఈ హత్య జరగడం గమనార్హం. ఏవోబీ కార్యదర్శి - మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ ఏపీలోకి వచ్చి మరీ ఈ హత్యను దగ్గరుండి చేయించారని తెలుస్తోంది.
*హత్యకు ముందు గంట సేపు చర్చలు..
ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ఈ హత్యలు జరిగినట్టు విశాఖపట్నం డీఐజీ శ్రీకాంత్ తెలిపారు. కిడారి, శివేరిలు భోజనం ముగించుకొని డుంబ్రీగూడ మండలంలోని తొట్టంగి రోడ్డుపై పది కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత మావోయిస్టులు అడ్డుకున్నారని తెలుస్తోంది. అనుచరులతో వెళ్తున్న కిడారి - సోములను అడ్డుకొని అనుచరులను కిందకు దించి వీరిద్దరిని మాత్రమే వాహనంలో ఉంచారని తెలుస్తోంది. ఎమ్మెల్యే గన్ మెన్ల నుంచి తుపాకులు లాక్కొని వారిని దూరంగా తరిమికొట్టారు. కాల్పులకు ముందు ఎమ్మెల్యేకున్న బాక్సైట్ గని తవ్వకాలు - ఓ క్వారీ తెరిపించే ప్రయత్నాలపై దాదాపు గంట సేపు చర్చలు జరిపారని తెలిసింది. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుందామని ఎమ్మెల్యే ఎంత చెప్పినా వినకుండా.. గంట తర్వాత మావోయిస్టులల కాల్చి చంపినట్టుగా సమాచారం. వారిని అతి సమీపం నుంచి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి చంపారు. మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. వారి తలలోకి బుల్లెట్లు దూసుకుపోవడంతో అక్కడిక్కడే చనిపోయారు.
*ఎంతమంది పాల్గొన్నారు..
ఆంధ్రా-ఒడిషా మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో దాదాపు 60మంది మావోయిస్టులు పాల్గొన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో 40మంది వరకూ మహిళలు ఉన్నట్టు సమాచారం.
*హత్యలకు గల కారణాలేంటి.?
ఎమ్మెల్యే కిడారి హత్యకు క్వారీ వివాదమే కారణంగా తెలుస్తోంది. కిడారికి చెందిన గూడ క్వారీని మూసివేయాలని మావోయిస్టులు పలుమార్లు ఆయనను హెచ్చరించినట్లు సమాచారం. ఈ క్వారీ పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నందున మూసివేయాలనే డిమాండ్ స్థానికుల నుంచి వ్యక్తమైంది. ఈ విషయంలో ఎమ్మెల్యే .. మావోయిస్టులతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పక్కా ప్రణాళికతో మావోయిస్టులు వల పన్ని తన మైనింగ్ దగ్గరకు వెళ్తున్న ఎమ్మెల్యే సర్వేశ్వరరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే శివేరు సోములను కాపు కాసి అడ్డుకొని చంపేశారు. ఎమ్మెల్యే పర్యటన విషయం తమకు తెలియదని పోలీసులు చెప్పడం కొసమెరుపు.
*తెలుగు రాష్ట్రాల్లో హై అలెర్ట్
అరకు ఎమ్మెల్యేను మావోయిస్టు హతమార్చడంతో పోలీసులు తెలుగు రాష్ట్రాల్లో హై అలెర్ట్ ప్రకటించారు. సమాచారం ఇవ్వకుండా ప్రజాప్రతినిధులు గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్లవద్దని సూచించారు. తాజా మాజీ మంత్రులు - ఎమ్మెల్యేలు - ప్రజాప్రతినిధులు పర్యటనల వివరాలు తమకు ఇవ్వాలని పోలీసులు కోరారు. రాష్ట్రవ్యాప్తంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నిఘాను పెంచారు. ఏజెన్సీ ప్రజాప్రతినిధులకు భద్రతను పెంచారు. ఎన్నికల వేళ చత్తీస్ గఢ్ - ఒడిశా సరిహద్దుల్లోని తెలంగాణ నియోజకవర్గ నేతలను అలెర్ట్ చేశారు.
*మానాన్నను ఎందుకు చంపారో తెలియదు: కిడారి కుమారుడు
తన తండ్రి కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు చంపడంపై ఆయన కుమారుడు నాని దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. తన తండ్రిని మావోయిస్టులు ఎందుకు చంపారో తెలియదంటూ బోరుమన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న నాని.. దాడి గురించి తెలియగానే వెంటనే విశాఖకు బయలు దేరాడు. మావోయిస్టులు నుంచి హెచ్చరికలు వచ్చినట్టు తమకు తెలియదని. తమ తండ్రి కూడా ఈ విషయం ఎప్పుడూ తమకు చెప్పలేదని వివరించాడు.