Begin typing your search above and press return to search.
మంత్రి..ఎంపీ... ఎమ్మెల్యే : టార్గెట్ చేసిన మావోలు
By: Tupaki Desk | 4 Oct 2022 9:47 AM GMTమావోలు మళ్లీ గర్జించారు. ఈసారి ఏకంగా వైసీపీ ప్రభుత్వం మీద తమ రాజకీయ విధానాన్ని ప్రకటించి మరీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ పుట్టుకే అక్రమాల అవినీతి నుంచే జరిగింది అంటూ ఆంధ్ర-ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కార్యదర్శి గణేష్ మండిపడ్డాఅరు. ఆ పార్టీ మూడున్నరేళ్ల పాలనలో అవినీతి చేసి దోచుకోవడం, భూ కబ్జాలు చేయడం తప్ప అభివృద్ధి ఎక్కడా లేదని తాజాగా విడుదల చేసిన ఒక లేఖలో పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు.
మూడు రాజధానులు అంటూ డ్రామాలు అడుతున్నా కొత్త జిల్లాల పేరిట ఓవర్ యాక్షన్ చేస్తున్నా అన్నీ కూడా సర్కారీ భూములను కబ్జా చేయడానికి వేస్తున్న భారీ స్కెచ్ లో భాగమే అని గణేష్ కుండబద్ధలు కొట్టారు. ఆఖరుకు గిరిజన ప్రాంతాలను సైతం వదలడంలేదని, అన్ని చోట్లా భూములను ఆక్రమించుకుంటూ అక్రమంగా సంపాదిస్తూ వైసీపీ ప్రజా ప్రతినిధులు అతి పెద్ద దోపిడీకి తెర తీసారని ఆరోపించారు.
ఇందులో ఉత్తరాంధ్రాకు చెందిన ఒక మంత్రి ఉన్నారని చెబుతూ లేఖలో సీదరి అప్పలరాజు పేరుని ప్రస్థావించారు. ఆయన శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రామకృష్ణాపురంలో సర్వేనంబర్ 143/1లో గతంలో ప్రజలు పోరాడి సాధించుకున్న 30 ఎకరాల విలువైన భూములతోపాటు, దాని చుట్టుపక్కల ఉన్న రైతుల భూములను కూడా తన అధికార బలంతో ఒక ఎంపీ సాయంతో వైసీపీ నేతల భాగస్వామ్యంతో ఆక్రమించుకున్నారని గణేష్ స్పష్టంగా పేర్కొన్నారు. ఆ విధంగా వైర్‌సీపీ నేతలు దువ్వాడ శ్రీధర్ మంత్రి సీదిరి అప్పలనాయుడు, ఓ ఎంపీ కలిసి తాము కబ్జా చేసిన భూములను ఒక కార్పొరేట్ కంపెనీకి వేలకోట్ల రూపాయలకు ధారదత్తం చేస్తున్నారు అంటూ లేఖలో ప్రస్తావించడంతో కలకలం రేగుతోంది.
ఈ భూములే కాకుండా పలాసా నియోజ్కవర్గం పర్ధిలోని కాశిబుగ్గ - పలాస జంట పట్టణాలకు అందుబాటులో ఉన్న సూదికొండ - నెమలికొండలను కూడా వైసీపీ నేతలు ఆక్రమించుకొని కోట్ల రూపాయల విలువ చేసే మట్టినీ, రాళ్ళను తమ ఇష్టం వచ్చినట్లుగా అమ్ముకుంటున్నారని గణేష్ కన్నెర్ర చేశారు. దీని వల్ల అకక్డ పర్యావరణం దారుణంగా దెబ్బతిని నీటి ఎద్దడి ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా సరే వీరికి పట్టడంలేదని మండిపడ్డారు.
విశాఖలో చూసుకుంటే ప్రతిష్టాత్మక ఏయూ భూములను కూడా చదును చేస్తామని చెప్పి మరీ భూకబ్జాలకు తెర తీశారని గణేష్ పేర్కొన్నారు. విశాఖ పర్యావరణానికి పెట్టింది పేరుగా ఉన్న రుషికొండ మీద అనధికార అక్రమ నిర్మాణాలు చేపడుతూ పర్యాటక శాఖ తన ఇష్టం వచ్చిన తీరున వ్యవహరిస్తోందని, దీని ఎవరూ ప్రశ్నించకుండా కట్టడి చేయడం దారుణం అని అన్నారు.
ఏజెన్సీలో చూస్తే ఏకంగా అరకు ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ గిరీజన కుటుబ్మాల భూములను ఆక్రమించుకున్నారని, ఇక రిసార్ట్స్, టూరిజం పేరిట వేలాది అటవీ భూములు గిరిజన భూములను ఆక్రమించుకుంటున్నారని గణేష్ మండిపడ్డారు. ఉత్తరాంధ్రా మొత్తం చూస్తే వైసీపీ నాయకుల భూ కబ్జాల కింద నలిగిపోతోందని ఆయన పేర్కొన్నారు.
ఇంతలా దారుణాలు అఘాయిత్యాలు చేస్తూ పేదలను పర్యవరణాన్ని దెబ్బతీస్తున్న వైసీపీ నేతలను ఆయా ప్రాంతాల నుంచి ప్రజలే తరిమికొట్టాలని గణేష్ పిలుపు ఇచ్చారు. మొత్తానికి చూసే గణేష్ ఇచ్చిన ఈ సీరియస్ వార్నింగ్ తో వైసీపీ కబ్జాల కధలో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. మావోలు గురి పెట్టారంటే ఇక జాగ్రత్తగా ఉండాలనే అంటున్నారు. లేకపోతే పరిణామాలు వేరేగా ఉంటాయని కూడా అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.