Begin typing your search above and press return to search.
బాబుతో మరో సీఎంపై మావోల కన్ను!
By: Tupaki Desk | 21 Jan 2017 10:49 AM GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోమారు మావోల ముప్పులో చిక్కుకున్నారని సమాచారం. సాక్షాత్తు కేంద్ర హోంశాఖ ఈ మేరకు హెచ్చరించింది. చంద్రబాబునాయుడుకు భద్రత మరింత పెంచాలని ఏపీ పోలీసు శాఖకు సూచించింది. ఈ మేరకు ఏపీ డీజీపీ కార్యాలయానికి లేఖ పంపినట్లు సమాచారం. కాగా మావోల నజర్ లో ఒడిశా ముఖ్యమంత్రి కూడా ఉన్నారని సమాచారం.
గత ఏడాది ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేతలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దాడికి ప్రతీకారంగానే మావోలు దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లు అప్పట్లోనే అంచనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే మావోయిస్టుల కదలికలపై కేంద్ర హోంశాఖ నిఘా పెట్టగా... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉందని తేలింది. దీంతో వెంటనే ఏపీ సీఎం చంద్రబాబుకు భద్రత మరింత పెంచాలని ఏపీ పోలీసు శాఖకు సూచిస్తూ ఏపీ డీజీపీ కార్యాలయానికి లేఖ పంపగా రాష్ట్ర పోలీసు శాఖ అప్రమత్తమైందని సమాచారం. ఇదే సమయంలో మావోల నజర్ లో ఉన్న రాష్ట్రానికి చెందిన టీడీపీ - బీజేపీ నేతలు కూడా ఉన్నట్లు సమాచారం రావడంతో వారి భద్రత విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మరోవైపు ఏపీ డీజీపీ సహా పలు రాష్ట్రాలకు - నేతలకు కేంద్ర హోం శాఖా హెచ్చరికలు జారీ చేసింది. భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏపీ పొరుగున ఉన్న ఒడిశా ముఖ్యమంత్రికి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రత్యేకంగా కోరింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/