Begin typing your search above and press return to search.
కేసీఆర్ పై మావోల గురి..పోలీసుల్లో కలవరం
By: Tupaki Desk | 7 Dec 2017 6:29 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పై మావోయిస్టులు గురిపెట్టారా? వినూత్న రీతిలో ప్రాజెక్టుల బాట పట్టిన కేసీఆర్ కు ఈ సమయంలో మావోల నుంచి ముప్పు పొంచి ఉందా? కేసీఆర్ సందర్శించే ప్రాంతానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే మావోయిస్టులు కీలక సమావేశం పెట్టుకోవడం వెనుక మర్మం ఏంటి?..ఇవన్నీ ఇప్పుడు రాష్ట్ర పోలీస్ - అధికార వర్గాల్లో సాగుతున్న చర్చ. ఇంతకీ ఈ చర్చ ఇంత విస్తృతంగా జరిగేందుకు కారణం...తాజాగా జరిగిన భారీ ఎన్ కౌంటర్!
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకు జరిగిన ఎన్ కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. మరో ఇద్దరు గాయపడ్డట్టు అధికారులు తెలిపారు. గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలూకా జింగనూర్ ఔట్ పోస్ట్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలోని కల్లెడ్ గ్రామ అటవీప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. కల్లెడ్ అడవుల్లో గత కొద్దిరోజులుగా మావోయిస్టుల ఆగడాలు శ్రుతిమించుతుండటంతో మహారాష్ట్రకు చెందిన యాంటీ మావోయిస్ట్ స్పెషల్ టీం.. ఆపరేషన్ ను ప్రారంభించింది. మంగళవారం అర్ధరాత్రి సీ-60 దళానికి చెందిన అరవై మంది ప్రత్యేక కమెండోలు మావోయిస్టుల కోసం కల్లెడ్ అడవుల్లో గాలింపు చర్యలు ప్రారంభించారు. చత్తీస్ గఢ్ సరిహద్దు వద్ద ఇరుపక్షాల నుంచి కాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ ఎన్ కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందగా.. ఇద్దరు గాయపడ్డారని, ఇతర మావోయిస్టులు పారిపోయారని అధికారులు తెలిపారు.
మరోవైపు ఈ పరిణామంతో తెలంగాణ పోలీసు అధికారులు ఉలిక్కిపడ్డారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ ప్రాజెక్టుకు కేవలం 20 కి.మీ.ల దూరంలోనే ఉండటం ఈ కలవరపాటుకు కారణం! ఎన్ కౌంటర్ ప్రభావంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తలదాచుకున్న మావోయిస్టులు రాష్ట్రంలోకి వచ్చే అవకాశం ఉండటంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. గురువారం సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటన ఉండటంతో ప్రాజెక్ట్ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకొన్న పోలీసులు...బందోబస్తును కట్టుదిట్టం చేశారు. సరిహద్దులోని అటవీ ప్రాంతం - రోడ్డు మార్గాలు - గ్రామాల్లో నిఘాను పెంచి - తనిఖీలు చేస్తున్నారు. గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు వస్తే సమాచారం అందించాలని కోరుతున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి పర్యటన సాగుతున్న సందర్భంగా మునుపటి కంటే బందోబస్తు పెంచారు.