Begin typing your search above and press return to search.
గిడ్డి ఎంతకు అమ్ముడుపోయింది చెప్పిన మావోలు!
By: Tupaki Desk | 10 Oct 2018 4:13 AM GMTఅధికారపార్టీలకి చెందిన ఎమ్మెల్యే కిడారి.. మాజీ ఎమ్మెల్యే సివేరిలను దారుణంగా హతమార్చిన మావోలు తాజాగా ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. ఇందులో పలు సంచలన అంశాల్ని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఒక పార్టీ గుర్తుపై గెలిచి.. తాజాగా టీడీపీలోకి జంప్ అయిన గిరిజన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి తీవ్రమైన హెచ్చరిక చేశారు.
అధికార పార్టీలో చేరేందుకు ఆమె రూ.20 కోట్లు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజాద్రోహి.. గిరిజన ద్రోహి.. అధికార పార్టీ తొత్తుగా వ్యవహరించే గిడ్డి ఈశ్వరి తమను నిందించటమా అని మండిపడిన మావోలు.. ఆమె రూ.20 కోట్లకు అధికార పార్టీకి అమ్ముడుబోయారని బహిరంగ లేఖలో వెల్లడించారు. తాను తీసుకున్న రూ.20కోట్లను రెండు నెలల వ్యవధిలో గిరిజనులకు పంచిపెట్టాలని సూచించారు.
ఒకవేళ అలా చేయని పక్షంలో కిడారి.. సోములకు పట్టిన గతే పడుతుందని తీవ్రంగా హెచ్చరించారు. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించాలని పేర్కొన్న మావోలు తాము చెప్పినట్లు చేయకుంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని పేర్కొన్నారు. మేం చెప్పినట్లుచేస్తావా? మంత్రి పదవి దొరుకుతుందని ఆశిస్తావా? తేల్చుకోవాలని మావోలు పేర్కొన్న వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి వార్నింగ్ ఇస్తూ లేఖను విడుదల చేసిన మావోలు.. అందులో పోలీసుల ప్రస్తావన తీసుకొచ్చారు. కిడారి..సివారిలను హతమార్చిన రోజున పోలీసు సోదరులు ఆయుధాలతో తమకు చిక్కినా వారిని తాము చంపలేదన్న విషయాన్ని ప్రస్తావించారు. పొట్ట కూటి కోసం ఉద్యోగం చేస్తున్నారని పెద్ద మనసుతో క్షమించి వదిలేశామన్నారు. అదే మా విప్లవ సోదరులు మీకు దొరికితే దొంగ కథలు అల్లి వాళ్లను నిస్సహాయుల్ని చేసి ఎన్ కౌంటర్ చేస్తారు కదా? మరి.. మా మాదిరి మీరు చేయగలరా ఆలోచించండి? అంటూ ప్రశ్నించటం గమనార్హం.