Begin typing your search above and press return to search.

సీదిరికి వరుస వార్నింగులు... ఆ రేంజ్ లో కబ్జాలున్నాయా?

By:  Tupaki Desk   |   14 Oct 2022 5:55 AM GMT
సీదిరికి వరుస వార్నింగులు... ఆ రేంజ్ లో కబ్జాలున్నాయా?
X
పేదల భూములను కబ్జాచేసే మద్దతుదారులను అదుపులో ఉంచుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయంటు మావోయిస్టులు మంత్రి సీదిరి అప్పలరాజును బెదిరిస్తు ఒక లేఖ విడుదల చేశారు.

రాష్ట్రంలో మావోయిస్టుల ఉనికి దాదాపు లేదనే అనుకోవాలి. ఏవోబీ అంటే ఆంధ్రా ఒడిస్సా బార్డర్ లో అదికూడా ఒడిస్సా వైపు, విశాఖ జిల్లా సరిహద్దులో కాస్త ఉనికి ఉందంతే. అప్పుడప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదా స్ధానిక నేతలను హెచ్చిరస్తు ఒక ఫోన్ కాల్ లేదా పోస్టర్లు మాత్రం అంటిస్తున్నారు.

ఇలాంటి పరిస్ధితుల్లో ఏకంగా ఒక మంత్రినే బెదిరిస్తు మావోయిస్టుల నుండి లేఖ రావటం ఆశ్చర్యంగానే ఉంది. అయితే ఈ విషయమై మంత్రి మాట్లాడుతు లేఖలోని అంశానికి తనకు సంబంధంలేదని కొట్టిపడేశారు. తన మద్దతుదారులు ఎవరు ఎలాంటి భూకబ్జాలకు పాల్పడటంలేదని ప్రకటించారు. తనంటే గిట్టని తన ప్రత్యర్దులే ఎవరైనా ఇలాంటి బెదిరింపు లేఖలను సృష్టించారేమో అనే అనుమానాన్ని వ్యక్తంచేశారు.

సరే విషయం ఏదైనా మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖను పోలీసులు స్వాదీనం చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు. గతంలో అంటే చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో కూడా మావోయిస్టులు ఫిరాయింపు ఎంఎల్ఏ కిడారి శ్రవణ్ కుమార్ తో పాటు ఆయన మద్దతుదారుడిని కాల్చి చంపిన విషయం తెలిసిందే.

అప్పట్లో ఆ ఘటన సంచలనం సృష్టించింది. ఎంఎల్ఏని కాల్చి చంపకముందు కూడా మావోయిస్టుల కదలికలపై పెద్దగా సమాచారం లేదు. అలాంటిది నియోజకవర్గం పర్యటనలో ఉండగా ప్రజాకోర్టు పేరుతో ఎంఎల్ఏని మావోయిస్టులు కాల్చిచంపేశారు.

అప్పట్లో భద్రతాదళాలు, లోకల్ పోలీసులు మావోయిస్టుల కోసం ఏవోబీ ప్రాంతాన్నంతా జల్లెడపెట్టి గాలింపులు చేశారు. దొరికిన వాళ్ళని దొరికినట్లు ఎన్ కౌంటర్లు చేసేశారు. దాంతో అప్పటినుండి మావోయిస్టుల ఉనికే పెద్దగా కనబడటంలేదు. అలాంటిది మళ్ళీ ఇంతకాలానికి మంత్రికి బెదిరింపు లేఖ రావటం ఆశ్చర్యంగానే ఉంది. శ్రీకాకుళం జిల్లాలోని పలాస నుండి 2019లో మొదటిసారి పోటీచేసి మంత్రయిన డాక్టర్ సీదిరి అప్పలరాజు బీసీ కమ్యూనిటీకి చెందిన నేత.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.