Begin typing your search above and press return to search.
టీడీపీ, బీజేపీలకు మావోయిస్టుల వార్నింగ్
By: Tupaki Desk | 18 Dec 2015 9:42 AM GMTతెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల ఉనికి బలపడుతోంది. పాలకవర్గాలను హెచ్చరిస్తూ గత కొంత కాలంగా ఎక్కడా పోస్టర్లు వంటివి వెలుగులోకి రాకపోయినా ఇటీవలే తెలంగాణలో ఆలాంటివి వేశారు. కేసీఆర్ - కవితలన హెచ్చరిస్తూ వరంగల్ జిల్లా బచ్చన్నపేటలో మావోయిస్టుల పోస్టర్లు వెలసిన సంగతి మర్చిపోకముందే తాజాగా ఆంధ్రప్రదేశ్ లోనూ అలాంటి పోస్టర్లు పడ్డాయి. అధికారంలో ఉన్న టీడీపీ - బీజేపీలను తరిమితరిమి కొట్టాలంటూ ఆ పోస్టర్లలో పిలుపునిచ్చారు.
మావోయిస్టులకు ఆలవాలమైన విశాఖ జిల్లాల గూడెం కొత్త వీధి మండలంలోని సిరిబాల ప్రాంతంలో మావోయిస్టుల పోస్టర్లు శుక్రవారం కనిపించాయి. బాక్సైట్ ఉద్యమం తీవ్రమవుతున్న తరుణంలో మావోయిస్టుల పోస్టర్లు కనిపించడం కలకలం రేపుతోంది. ఆన్ రాక్ యాజమాన్యంతో టీడీపీ కుమ్మక్కయిందని అందులో ఆరోపించారు. బాక్సైట్ కు వ్యతిరేకంగా అందరూ ఏకం కావాలని పిలుపునిస్తూ టీడీపీ, బీజేపీలను తరిమికొట్టాలని అందులో పిలుపునిచ్చారు. మన్యంలో బాక్సైట్ గనుల తవ్వకం జరిపితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.