Begin typing your search above and press return to search.
గులాబీ నేతలకు మావోలు ఇచ్చిన వార్నింగ్?
By: Tupaki Desk | 21 Nov 2015 9:27 AM GMTతెలంగాణ అధికారపక్షానికి చెందిన టీఆర్ ఎస్ నేతల్ని మావోయిస్ట్ లు కిడ్నాప్ చేయటం తెలిసిందే. ఖమ్మం జిల్లాకు చెందిన నియోజకవర్గ నేతల్ని అపహరించిన మావోలు.. వారిని శనివారం వదిలేయటం.. వారు క్షేమంగా బయటపడటం తెలిసిందే.
వాస్తవానికి టీఆర్ ఎస్ నేతలు అపహరణకు గురైన తర్వాత.. వారి ఆచూకీ తెలియపోవటం.. మావోల నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవటంతో ఒకింత ఉత్కంట చోటుచేసుకుంది. ఏం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమైంది. ఈ సస్పెన్స్ కు తెర దించుతూ.. టీఆర్ ఎస్ నేతల్ని మావోలు క్షేమంగా విడుదల చేయటంతో టీఆర్ ఎస్ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. మావోల చెర నుంచి విడుదల అయిన గులాబీ నేతలు తాజాగా మీడియాతో మాట్లాడారు.
మావో నేతలు తమకు చెప్పిన విషయాల్ని మీడియాకు వెల్లడించాలని చెప్పారని.. అందులో భాగంగా వారి సందేశాన్ని నేతలు చెప్పుకొచ్చారు. బూటకపు ఎన్ కౌంటర్ పట్ల టీఆర్ ఎస్ ప్రభుత్వ వైఖరి మారాలని.. అలా కాకుంటే.. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి మావో నేతల్ని అంతం చేస్తామని వారు హెచ్చరించినట్లుగా టీఆర్ ఎస్ నేతలు పేర్కొన్నారు. కిడ్నాప్ చేసిన మావోలు తమను జాగ్రత్తగా చూసుకున్నారని వారు వెల్లడించారు. ఎన్ కౌంటర్లు.. కూబింగ్ లు తక్షణమే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారన్నారు.